కార్తిక సోమవారం.. పాలకొల్లు శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో పోటెత్తిన భక్తులు

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తిక మాసం 2వ సోమవారం తెల్లవారుజాము నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. ఈరోజు పౌర్ణమి రాత్రిగా రావడం వల్ల 33 పున్నమి నోములు నోచుకునే వారు, ఉపవాసం ఉండేవారు 365 వత్తుల దీపారాధన చేసేవారు ఈ సోమవారం చేసుకోవాలని ఆలయ అర్చకులు తెలిపారు. సోమవారం స్వామివారికి విశేషమైన పూజా కార్యక్రమాలు, నివేదనలు జరుతాయని.. మంగళవారం ఉదయం 4 నుంచి 8గంటల వరకు మాత్రమే ఆలయం తెరిచి ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు.

Updated : 07 Nov 2022 12:11 IST

మరిన్ని