Jigarthanda DoubleX: ‘జిగర్తాండ డబుల్‌ఎక్స్‌’.. ఇది టీజర్‌లాంటిది చూశారా?

రాఘవ లారెన్స్‌, ఎస్‌జే సూర్య కీలక పాత్రల్లో కార్తిక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జిగర్తాండ డబుల్‌ఎక్స్‌’. ఆదివారం ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో లారెన్స్‌ గన్స్‌ పట్టుకుని, బీడీ తాగుతూ మాస్‌ పాత్రలో కనిపించగా, ఎస్‌జే సూర్య సూట్‌ వేసుకుని స్టైల్‌గా కనిపించారు. అసలు ఈ సినిమా కథేంటి? పాత్రలు ఎలా ఉంటాయి? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. గతంలో కార్తిక్‌ సుబ్బరాజ్‌ ‘జిగర్తాండ’ మూవీని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.  తెలుగులో దీన్నే ‘గద్దలకొండ గణేష్‌’గా, హిందీలో ‘బచ్చన్‌పాండే’గా రీమేక్‌ చేశారు.

Published : 11 Dec 2022 18:46 IST

Tags :

మరిన్ని