Surya kumar yadav: ‘స్కై’ వీర విధ్వంసం.. ఫటా ఫట్‌ హైలైట్స్‌

ఈ సీజన్లో ఆలస్యంగా పుంజుకుని 200 లక్ష్యాలను ఛేదించడం అలవాటుగా మార్చుకున్న ముంబయి.. ఈసారి మొదట బ్యాటింగ్‌ చేస్తూ ఆ మార్కును దాటింది. శుక్రవారం సూర్యకుమార్‌ యాదవ్‌ (103 నాటౌట్‌; 49 బంతుల్లో 11×4, 6×6) మెరుపులతో 5 వికెట్లకు 218 పరుగుల భారీ స్కోరు చేసిన ముంబయి.. గుజరాత్‌ను 191/8కు కట్టడి చేసింది. ధాటిగా ఆడితే ముంబయి కష్టం మీద 200 చేరుకోవచ్చని.. సూర్య చివరి వరకు ఉంటే 60-70 మధ్య స్కోరు చేస్తాడని అంచనా! కానీ ముంబయి ఏకంగా 218 పరుగులు చేసింది.  చివరి 6 ఓవర్లలో ముంబయి 79 పరుగులు రాబడితే.. అందులో సూర్య వాటానే 68. రెండో అర్ధశతకానికి అతను తీసుకున్న బంతులు కేవలం 17.

Published : 13 May 2023 08:11 IST

Tags :

మరిన్ని