Tilak Varma: విమానంలో తిలక్‌ వర్మ గాఢ నిద్ర.. అప్పుడు సూర్యకుమార్‌ ఏం చేశాడంటే?

లఖ్‌నవూ (LSG)తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ (MI) ఘన విజయం సాధించింది. గుజరాత్‌ టైటాన్స్‌ (GT)తో క్వాలిఫయర్-2 ఆడేందుకు అహ్మదాబాద్‌కు చేరుకుంది. ఈ క్రమంలో విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ముంబయి బ్యాటర్ తిలక్ వర్మ (Tilak Varma) నోరు కాస్త తెరిచి గాఢ నిద్రలోకి జారుకున్నాడు. దీన్ని గమనించిన సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) విమాన సిబ్బంది వద్ద నిమ్మకాయ ముక్కను తీసుకుని.. దాని రసాన్ని తిలక్ వర్మ నోట్లో పిండాడు. దీంతో తిలక్ వర్మ వెంటనే నిద్రలోంచి లేచాడు. ఏం జరిగిందా.. అని కాసేపు ఆశ్చర్యపోయి తర్వాత నవ్వుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబయి ఇండియన్స్‌ తన ట్విటర్ ఖాతాలో పంచుకుంది. మీరూ ఆ వీడియోను చూసేయండి.

Published : 25 May 2023 20:11 IST

Tags :

మరిన్ని