Tiger 3 : ‘టైగర్‌ 3’ ట్రైలర్‌.. ఫైట్స్‌తో అదరగొట్టేసిన సల్మాన్‌-కత్రినా జోడీ

ముంబయి: సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) - కత్రినా కైఫ్‌ (Katrina Kaif) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘టైగర్‌ 3’ (Tiger 3). మనీశ్‌ శర్మ దర్శకుడు. ‘ఏక్‌ థా టైగర్‌’, ‘టైగర్‌ జిందా హై’ చిత్రాలకు సీక్వెల్‌గా ఈసినిమా సిద్ధమవుతోంది. దేశభక్తి నేపథ్యంలో పవర్‌ఫుల్ యాక్షన్‌ ప్యాక్డ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. దీపావళి సెలబ్రేషన్స్‌లో భాగంగా నవంబర్‌ 12న ఇది విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం ‘టైగర్‌ 3’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాతో సల్మాన్‌ - కత్రినా జోడీ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైనట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. ముఖ్యంగా సల్మాన్‌పై చిత్రీకరించిన ఫైట్‌ సీక్వెన్స్‌లు.. కత్రినా చేసిన బాత్‌ టవల్‌ ఫైట్‌ సీన్‌ అదరహో అనేలా ఉన్నాయి.

Published : 16 Oct 2023 12:45 IST

Tags :

మరిన్ని