సొంతంగా కిడ్డీబ్యాంక్‌!

ఒకవైపు పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతూ, మరోవైపు వారిలో కాస్త సృజనాత్మకతనూ పెంచాలనుకుంటున్నారా... అయితే మార్కెట్లో దొరుకుతున్న ‘పెయింట్‌ యువర్‌ ఓన్‌ మనీ బాక్స్‌’ను బహుమతిగా ఇచ్చేయండి.

Published : 07 May 2023 00:02 IST

సొంతంగా కిడ్డీబ్యాంక్‌!

కవైపు పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతూ, మరోవైపు వారిలో కాస్త సృజనాత్మకతనూ పెంచాలనుకుంటున్నారా... అయితే మార్కెట్లో దొరుకుతున్న ‘పెయింట్‌ యువర్‌ ఓన్‌ మనీ బాక్స్‌’ను బహుమతిగా ఇచ్చేయండి. ఎన్నో వెరైటీల్లో కిడ్డీ బ్యాంకులు వస్తున్నా... ఇది మాత్రం చిన్నారులకు తప్పకుండా నచ్చుతుంది. ఎందుకంటే టెడ్డీబేర్‌, యూనికార్న్‌, రాకాసిబల్లీ, బాతూ, పిగ్గీ... ఇలా బోలెడన్ని బొమ్మలతో వచ్చే ఈ డబ్బుల పెట్టెకి జతగా రంగులూ, డెకరేషన్‌ స్టోన్స్‌, పెయింట్‌ బ్రష్‌ కూడా వస్తాయి. సాదాగా ఉండే ఆ బొమ్మను చిన్నారులు ఎవరికి నచ్చినట్టు వాళ్లు రంగులు వేసుకుని డిజైన్‌ చేసుకోవచ్చన్నమాట. సొంతంగా తయారుచేసుకున్న ఆ కిడ్డీబ్యాంకును అపురూపంగా చూసుకుంటూ ఇంట్లోవాళ్లు ఇచ్చే డబ్బుల్ని దాచుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..