టీపాయ్‌తో ఛార్జింగ్‌

ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టి టీవీ చూస్తుంటే కాల్స్‌ లేదంటే మెసేజ్‌లు వస్తుంటాయి. మాటిమాటికీ సోఫాలోంచి లేచి ఫోన్‌ అందుకుని చూసి...

Updated : 21 May 2023 04:16 IST

ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టి టీవీ చూస్తుంటే కాల్స్‌ లేదంటే మెసేజ్‌లు వస్తుంటాయి. మాటిమాటికీ సోఫాలోంచి లేచి ఫోన్‌ అందుకుని చూసి... మళ్లీ ఛార్జింగ్‌ పెడుతుంటారు. దీనివల్ల కాస్త చిరాగ్గానే ఉంటుంది. అదే స్మార్ట్‌ టీపాయ్‌ తెచ్చుకుంటే మనం ఎక్కడ ఉంటే అక్కడ ఆ టీపాయ్‌ని పెట్టేసి దానిపైన ఫోన్‌ ఉంచితే ఛార్జింగ్‌ అవుతుంది. దానికున్న బ్లూటూత్‌ ద్వారా ఫోనుకు అనుసంధానిస్తే కాల్స్‌ మాట్లాడుకోవచ్చు. పాటలు వినొచ్చు. స్మార్ట్‌ గడియారాలను సైతం ఛార్జింగ్‌ చేసుకోవచ్చు. రీఛార్జబుల్‌ లిథియం బ్యాటరీతో నడిచే ఈ టేబుల్‌కున్న యూఎస్‌బీ కేబుల్‌ ద్వారా కూడా ఫోన్లు ఛార్జింగ్‌ పెట్టుకోవచ్చు. పెరట్లోనూ, బాల్కనీలోనూ ఎక్కడైనా సరే స్విచ్‌బోర్డుతో అవసరం లేకుండా కాఫీటేబుల్‌గానూ, ఛార్జింగ్‌ పాయింట్‌గానూ పనిచేసే ఈ స్మార్ట్‌ టీపాయ్‌ని కొంటే అవసరాలన్నీ తీరిపోతాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..