Published : 24 Sep 2022 23:02 IST

Weekly Horoscope: రాశి ఫలం ( సెప్టెంబరు 25 - అక్టోబరు 1 )


ముఖ్యకార్యాల్లో మంచి జరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలుంటాయి. ధర్మమార్గంలో బాధ్యతలను పూర్తిచేయండి. వ్యాపారం బాగుంటుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. మంచి నిర్ణయంతో
గొప్ప లాభాన్ని పొందే అవకాశముంది. పనుల్ని వాయిదా వేయవద్దు. లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే మంచిది.


ఉద్యోగంలో శ్రద్ధ పెంచితే తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ఇప్పుడు చేసే పనులు స్థిరమైన జీవితాన్ని ఇస్తాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి, పలు మార్గాల్లో అభివృద్ధిని సాధిస్తారు. సకాలంలో చేసే పనులు శక్తినిస్తాయి. కలహాలకు దూరంగా ఉండాలి. శాంతచిత్తంతో మాట్లాడాలి. కుటుంబపరంగా శాంతి లభిస్తుంది. దుర్గాధ్యానం మేలుచేస్తుంది.


వ్యాపార విజయం సూచితం. మనోబలం సదా ముందుకు నడిపిస్తుంది. ప్రణాళికతో పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక లాభాలు ఉన్నాయి. ఉద్యోగపనులు సకాలంలో చేయాలి. తెలియని విఘ్నాలు ఉన్నాయి. తొందరపడవద్దు. పరిస్థితులు అనుకూలించే వరకు మౌనం వహించాలి. సూర్యధ్యానం మనోబలాన్నిస్తుంది.


శ్రేష్ఠమైన ఫలితముంది. స్వల్ప ప్రయత్నంతోనే విజయం అందుకుంటారు. తగు నిర్ణయాలు తీసుకుని పనిచేయండి. మీ ప్రవర్తన నలుగురికీ ఆదర్శమవుతుంది. వ్యాపారంలో మిశ్రమ ఫలితం సూచితం. చంచలత్వం పనికిరాదు. చెడు ఆలోచించవద్దు. బంధుమిత్రులతో ఆనందిస్తారు. చంద్రగ్రహ శ్లోకం చదవండి, ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది.


వ్యాపారం బాగుంటుంది. ఆర్థికంగా బలపడతారు. పనుల్ని మధ్యలో ఆపవద్దు. కార్యసాధనలో ఓర్పు అవసరం. అభీష్టసిద్ధి విశేషంగా ఉంది. ఉద్యోగంలో నిరుత్సాహం వద్దు. అదృష్టవంతులు అవుతారు. వారం మధ్యలో ఒక మంచి పని పూర్తి చేస్తారు. మీవల్ల కుటుంబసభ్యులకు కలిసివస్తుంది. ఇష్టదైవాన్ని స్మరించండి, శుభ ఫలితాలు సిద్ధిస్తాయి.


సామరస్యధోరణితో వ్యవహరించి ఉద్యోగంలో సమస్యని అధిగమిస్తారు. మీరు కోరుకున్న ఫలితం వస్తుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. చంచల మనస్తత్వం పనికిరాదు. వృథా వ్యయం పెరగకుండా చూసుకోవాలి. ఇంట్లో శుభం జరుగుతుంది. మంచి వార్త వింటారు. వ్యాపారంలో సొంతనిర్ణయం మేలుచేస్తుంది. ఇష్టదేవతా స్మరణ శక్తినిస్తుంది.


కాలం అనుకూలంగా లేదు. పొరపాట్లు జరగకుండా పనిచేయాలి. ఉద్యోగంలో సమస్యలుంటాయి. తెలియని విషయాల్లో తల దూర్చవద్దు. అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. సమష్టికృషి సత్ఫలితాన్నిస్తుంది. వ్యాపారం అనుకూలంగాలేదు. కాలం సహనాన్ని పరీక్షిస్తోంది. మౌనం అవసరం. ఇష్టదైవంతో పాటు నవగ్రహశ్లోకాలు చదవండి, మంచి జరుగుతుంది.


ఉత్తమకాలం నడుస్తోంది. అదృష్టం కలిసొస్తుంది. సరైన నిర్ణయాలతో కోరికలను నెరవేర్చుకోవాలి. ఎటుచూసినా శ్రేష్ఠమైన ఫలితమే గోచరిస్తోంది. ఉద్యోగంలో అనుకున్నది సాధిస్తారు. అధికారుల ప్రశంసలుంటాయి. వ్యాపారంలో లాభముంది. నూతనప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా మంచి కాలమిది. కుటుంబసహకారం లభిస్తుంది. ఇష్టదేవతను స్మరిస్తే మేలు.


ఉద్యోగం చాలా బాగుంటుంది. నైపుణ్యం వృద్ధి చెందుతుంది. స్థిరచిత్తంతో లక్ష్యాన్ని చేరాలి. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు విజయాన్నిస్తాయి. తోటివారి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారంలో సమస్య రాకుండా చూసుకోవాలి. ఆర్థిక విషయాల్లో తడబాటు పనికిరాదు. మొహమాటం వల్ల ఇబ్బందులు వస్తాయి. నవగ్రహశ్లోకాలు చదువుకోండి, మనశ్శాంతి లభిస్తుంది.


ముఖ్యకార్యాల్లో అప్రమత్తంగా ఉంటే అనుకున్నది నెరవేరుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగంలో ప్రశంసలుంటాయి. పనులను సకాలంలో చేయాలి. కొత్త విషయాలు తెలుసుకుంటూ మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలి. కుటుంబసభ్యులతో కలిసి చేసే పనులు విజయాన్నిస్తాయి. ఒక ప్రమాదం నుంచి బయటపడతారు. నవగ్రహధ్యానం శుభాన్నిస్తుంది.


ఉద్యోగం అనుకూలం. నిండుమనసుతో చేసే పని త్వరగా విజయాన్నిస్తుంది. ధర్మమార్గంలో లక్ష్యాలను సాధించాలి. తెలియని విఘ్నాలుంటాయి.  కాలం వృథా చేయకుండా ముఖ్యవ్యక్తులతో చర్చిస్తూ సరైన నిర్ణయాలు తీసుకోవాలి. వారం మధ్యలో ఒక మేలు జరుగుతుంది. దృఢసంకల్పంతో ముందుకు సాగండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానిస్తే మేలు.


మనోబలంతో పని మొదలుపెట్టాలి. ఒత్తిడి ఉన్నా మీ బాధ్యతలకు ఆటంకం కలగదు. అంతా మీరు ఊహించినట్లే జరుగుతుంది. చంచల స్వభావం వల్ల పనులు ఆగకుండా చూసుకోవాలి. త్రికరణ శుద్ధితో పనిచేయాలి. ఆత్మీయుల సూచనలు తోడ్పడతాయి. వ్యాపారంలో సొంత నిర్ణయం రక్షిస్తుంది. విష్ణుసహస్రనామం చదవండి, శాంతి లభిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts