పల్లెలో పెద్ద యోగా కేంద్రం!

ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు జమ్మూ కశ్మీర్‌. అక్కడి హిమగిరుల నడుమనున్న ఓ గ్రామం ఇప్పుడు విశ్వవ్యాప్త కీర్తిని ఆర్జించబోతోంది.

Updated : 25 Mar 2023 17:03 IST

పల్లెలో పెద్ద యోగా కేంద్రం!

ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు జమ్మూ కశ్మీర్‌. అక్కడి హిమగిరుల నడుమనున్న ఓ గ్రామం ఇప్పుడు విశ్వవ్యాప్త కీర్తిని ఆర్జించబోతోంది. అదే తావి నదీతీరంలోని మంటలై గ్రామం. కైలాశ్‌కుండ్‌లో పుట్టిన తావి నదిని సూర్యపుత్రిగానూ పిలుస్తారు.
దాని ఒడ్డునే దేశంలోనే పెద్ద యోగా కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు పదివేల కోట్లు మంజూరు చేసింది. పెద్ద పెద్ద ధ్యాన మందిరాలు, జిమ్‌లు, ఆడిటోరియం, హెలీప్యాడ్‌, స్పా, క్యాంటీన్లూ, రెస్టరంట్లు, సోలార్‌ పైకప్పులతో కూడిన కాటేజ్‌లు, షాపింగ్‌ కాంప్లెక్సులు, కాన్ఫరెన్స్‌ రూమ్‌లు, ఈతకొలనులతో సుమారు 125 ఎకరాల సువిశాల ప్రాంగణంలో దాన్ని ఆధునికంగా తీర్చిదిద్దారు. ఒకచోట నుంచి ఇంకో చోటకి వెళ్లడానికి బ్యాటరీ కార్లనూ అందుబాటులో ఉంచారు. ఆ ఏర్పాట్లతో అటు పర్యటక రంగాన్ని ప్రోత్సహిస్తూ... ఇటు కార్పొరేట్‌ ప్రపంచాన్ని ఆకట్టుకునేలా చేస్తున్నారు. ఈ అతిపెద్ద యోగా కేంద్రంలో ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు. అందుకు తగిన ఏర్పాట్లూ ఉన్నాయక్కడ. పచ్చదనం, మంచు పర్వతాల నడుమ సేద తీరాలనుకునేవారికి ఈ యోగా కేంద్రం చక్కని అతిథ్యం ఇస్తుందనడంలో  ఏ మాత్రం అతిశయోక్తి లేదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..