హృదయం ఇక్కడున్నది!

చుట్టూ నీళ్లు... మధ్యలో రిసార్ట్‌తో ఉన్న ఈ దీవిని చూశారంటే- తప్పకుండా ప్రేమలో పడిపోతారు. హృదయాకారంలోని ఈ దీవి రూపమే దీని అసలైన ప్రత్యేకత.

Published : 10 Feb 2024 23:33 IST

చుట్టూ నీళ్లు... మధ్యలో రిసార్ట్‌తో ఉన్న ఈ దీవిని చూశారంటే- తప్పకుండా ప్రేమలో పడిపోతారు. హృదయాకారంలోని ఈ దీవి రూపమే దీని అసలైన ప్రత్యేకత. ఐలాండ్‌ మధ్యలో హోటళ్లూ రిసార్టులూ చాలానే ఉండొచ్చు కానీ ఈ దీవి హృదయాకారంలో పచ్చని చెట్లతో ఎంతో అందంగా ఉంటుంది మరి. అందుకే ఎందరెందరో ప్రేమికులు ఇక్కడికి వస్తుంటారు. మేక్‌పీస్‌ ఐలాండ్‌గా పిలిచే ఈ దీవి ఆస్ట్రేలియాలోని నూసా నది మధ్యలో ఉంటుంది. ఈత కొలను, థియేటర్‌, రెస్టరంట్‌, ఆట మైదానాలతో ఉండే ఈ దీవిలోకి కొన్నేళ్ల క్రితం వరకూ బయటివారికి అనుమతి ఉండేది కాదు. హార్ట్‌ షేప్‌లోని ఈ ఐలాండుకున్న క్రేజ్‌ విపరీతంగా పెరిగిపోవడంతో 2009 నుంచి పర్యటకులకూ అనుమతి ఇచ్చారు ఈ దీవి యజమానులు. 30 మంది అతిథులు బస చేసేలా గదుల్ని ఏర్పాటుచేసి ఇతర హంగుల్నీ అద్దారు. మిగతా వారి సంగతి ఎలా ఉన్నా... మనసులోని ప్రేమను కళ్లముందూ చూపాలనుకునే ప్రేమికులు మాత్రం తరచూ ఇక్కడ వాలిపోతుంటారట. వాలెంటైన్స్‌ డే రోజుకైతే బుకింగ్‌ కోసం ముందు నుంచే క్యూలో ఉంటారట!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..