సీఈవోగా రోబో

రోబోలు... అనేక పనుల్లో మనకు సాయపడటానికి సృష్టించినవి. మన ఆజ్ఞలను పాటిస్తూ ఇళ్లలో, ఆఫీసుల్లో, కర్మాగారాల్లో పలు విధాలుగా ఇవి విధులు నిర్వహిస్తున్నాయి. అయితే పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమాని ఇప్పుడివి బాస్‌గానూ ఉద్యోగులకు ఆదేశాలిచ్చేస్తున్నాయి.

Published : 25 Mar 2023 23:46 IST

సీఈవోగా రోబో

రోబోలు... అనేక పనుల్లో మనకు సాయపడటానికి సృష్టించినవి. మన ఆజ్ఞలను పాటిస్తూ ఇళ్లలో, ఆఫీసుల్లో, కర్మాగారాల్లో పలు విధాలుగా ఇవి విధులు నిర్వహిస్తున్నాయి. అయితే పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమాని ఇప్పుడివి బాస్‌గానూ ఉద్యోగులకు ఆదేశాలిచ్చేస్తున్నాయి. ఆ దృశ్యాన్ని చైనాలోని మెటావర్స్‌ కంపెనీ అయిన నెట్‌డ్రాగన్‌ వెబ్‌సాఫ్ట్‌ అనే గేమింగ్‌ సంస్థలో చూడొచ్చు. గతేడాది ఆగస్టులోనే ఆ సంస్థ యాజమాన్యం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా నడిచే టాంగ్‌ యు అనే రోబోను సీఈవోగా నియమించింది. కానీ, మొదట్లో రోబోను నియమించడానికి ఎందరో ఉన్నతోద్యోగులు యాజమాన్యం నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కానీ ఆర్నెల్లలో టాంగ్‌ యు పనితీరు, 10 శాతం పెరిగిన షేర్లు చూశాక అందరూ దాన్ని మెచ్చుకుంటున్నారు. మరికొన్ని సంస్థలూ ఇలాంటి హ్యుమనాయిడ్‌ రోబోలను ఉద్యోగంలో చేర్చుకోవడానికి మొగ్గుచూపుతున్నాయట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు