Free Photoshoot: ఫ్రీగా ఫొటోషూట్‌

గర్భం దాల్చింది మొదలు పిల్లలు పెరిగి పెద్ద వాళ్లయ్యే వరకూ- రకరకాల సందర్భాల్లో ఫొటోషూట్లు చేయడం మనకు తెలిసిందే. ఆ తీపి జ్ఞాపకాలను భద్రపరుచుకోవడానికి ఎంత ఖర్చైనా సరే వెనకాడట్లేదు చాలామంది తల్లిదండ్రులు

Updated : 03 Sep 2023 12:35 IST

గర్భం దాల్చింది మొదలు పిల్లలు పెరిగి పెద్ద వాళ్లయ్యే వరకూ- రకరకాల సందర్భాల్లో ఫొటోషూట్లు చేయడం మనకు తెలిసిందే. ఆ తీపి జ్ఞాపకాలను భద్రపరుచుకోవడానికి ఎంత ఖర్చైనా సరే వెనకాడట్లేదు చాలామంది తల్లిదండ్రులు. అయితే అలాంటి ఫొటోషూట్లను(Free Photoshoot) ఉచితంగా చేసి పెట్టడానికి ముందుకొచ్చింది ఓ ఆసుపత్రి. అదేంటీ ఫొటోషూట్‌ చేయాల్సింది ఫొటోగ్రాఫర్లుగానీ డాక్టర్లు కాదుగా అని సందేహం రావచ్చు. ఫొటోలు తీసేది ఫొటోగ్రాఫర్లే అయినా ఆ ఏర్పాట్లు చేసేది మాత్రం హాస్పిటలే. ఈ వినూత్న ప్రయత్నం చేస్తోంది మరెవరో కాదు బెంగళూరులోని రాధాకృష్ణా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌. తమ ఆసుపత్రికి ప్రచారం కల్పించుకోవడంలో భాగంగా రకరకాల ప్రకటనలు ఇస్తుంటారు.
రాయితీలు ప్రకటిస్తుంటారు. ఈ ఆసుపత్రి మాత్రం గర్భిణులకు ఉచితంగా- మెటర్నిటీషూట్‌తోపాటు, బిడ్డ భూమ్మీదకు వచ్చిన అపురూప క్షణాలను సైతం ఫొటో- వీడియో షూట్‌ చేసి పెడుతోంది. మాతృమూర్తుల్ని ఆకట్టుకోవడానికి భలే ఆఫరిచ్చారు కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..