దోమలు రాకుండా..!
దోమలు కుట్టడం వల్ల ఎంతోమంది ప్రాణాంతక వ్యాధులకు గురవుతున్నారు. దాంతో గదుల్లో మస్కిటో రిపెల్లెంట్ల వాడకం తప్పనిసరిగా మారింది. అయినా వాటి దారిన అవి వస్తూనే ఉన్నాయి. అక్కడికీ కొంతమంది అవి కుట్టకుండా రకరకాల రిపెల్లెంట్ స్ప్రేలనీ రాసుకుంటున్నారు. కానీ ప్రస్తుతం వాడుకలో ఉన్న రిపెల్లెంట్ల ప్రభావం రెండు గంటల తరవాత క్రమేణా తగ్గిపోతుంటుంది. పైగా అవన్నీ ఘాటైన వాసననీ కలిగి ఉంటాయి. ఇటలీకి చెందిన పిసా, ఫిరెంజె యూనివర్సిటీలకు చెందిన కొందరు పరిశోధకులు కొత్త ఫార్ములాతో సైక్లిక్ హైడ్రాక్సీఎసిటేల్స్ అనే పదార్థంతో కూడిన రిపెల్లెంట్ స్ప్రేను రూపొందించారట. ఇది కనీసం ఎనిమిది గంటలపాటు దోమల్ని అడ్డుకుంటుందట. కొత్తగా రూపొందించిన ఈ పదార్థం ఆహ్లాదకరమైన పరిమళాన్ని వెదజల్లడంతోబాటు ప్రస్తుతం ఉన్నవాటికన్నా త్వరగా నీళ్లలో కరిగిపోతుందనీ చెబుతున్నారు. కాబట్టి దీనివల్ల ఇతరత్రా దుష్పరిణామాలూ తక్కువేనట.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
India News
XBB.1.16: కొవిడ్ తాజా విజృంభణకు ఈ వేరియంట్ కారణమా..?
-
Movies News
ott movies: ఈ వారం ఓటీటీలో 18 చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
-
General News
AP High court: ఏపీ హైకోర్టు తరలింపు న్యాయస్థానాల పరిధిలోనే: కేంద్ర ప్రభుత్వం
-
Sports News
Rohit - IPL: ఐపీఎల్లో ఆటగాళ్ల పనిభారంపై ఫ్రాంచైజీలదే బాధ్యత: రోహిత్ శర్మ
-
Movies News
Social Look: సారా అలీఖాన్ ‘పింక్’ మూడ్.. తుపాకీ పట్టిన లక్ష్మీరాయ్!
-
Crime News
Hyderabad: అంగట్లో అమ్మకానికి 16.8 కోట్ల మంది డేటా.. ఆరుగురి అరెస్టు