శబ్ద కాలుష్యంతో...

రోడ్లమీద ప్రయాణించే వాహనాల శబ్దకాలుష్యానికి సమీపంలో నివసించే వాళ్లకి బీపీ వచ్చే ప్రమాదం ఎక్కువని అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కార్డియాలజీ నిపుణులు పేర్కొంటున్నారు.

Published : 02 Apr 2023 00:38 IST

శబ్ద కాలుష్యంతో...

రోడ్లమీద ప్రయాణించే వాహనాల శబ్దకాలుష్యానికి సమీపంలో నివసించే వాళ్లకి బీపీ వచ్చే ప్రమాదం ఎక్కువని అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కార్డియాలజీ నిపుణులు పేర్కొంటున్నారు.  రద్దీ ఎక్కువగా ఉండే రోడ్లమీద నుంచి నిరంతరాయంగా హారన్లూ ఇంజిన్లూ సైరన్ల మోతలు ఎక్కువగా వస్తుంటాయి. వీటివల్ల బీపీ పెరుగుతుంటుందట. ఈ విషయం గతపరిశోధనల్లోనే తేలినప్పటికీ అందుకు కారణం శబ్దమా లేక వాయు కాలుష్యమా అన్నదాన్ని కచ్చితంగా గుర్తించలేకపోయారట. తాజాగా చేసిన పరిశీలనలో ట్రాఫిక్‌ శబ్దాలకు గురవడం వల్లే బీపీ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని తేలింది. ఈ విషయమై బీపీ సమస్యలు లేని  40-69 ఏళ్ల వయసున్న రెండున్నర లక్షల మందిని ఎంపికచేసి వాళ్లు నివసించే ప్రదేశాల వివరాలను సేకరించారట. ఆయా ప్రదేశాల్లో వచ్చే శబ్దకాలుష్యంతోపాటు గాల్లోని నైట్రోజన్‌-డై-ఆక్సైడ్‌ల శాతాన్నీ లెక్కించారట. అందులో వాయు, శబ్ద కాలుష్యాలు రెండింటి బారిన పడ్డవాళ్లలో బీపీ సమస్య ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు, వాయుకాలుష్యం తక్కువగా ఉండి, శబ్ద కాలుష్యం ఉన్నచోట నివసించేవాళ్లలోనూ బీపీ ఎక్కువగా కనిపించింది. దీని ఆధారంగా శబ్దంవల్లే బీపీ ఎక్కువగా పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పరిశీలకులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు