Weekly Horoscope: గ్రహబలం (మే 15 - 21)
వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. మంచి ఆలోచనలతో ధైర్యంగా ముందుకు నడుస్తారు. ఉద్యోగంలో కార్యసిద్ధి ఉంటుంది. ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే వారుంటారు. మితంగా మాట్లాడాలి. స్వవిషయాలు ఎవరితోనూ చర్చించవద్దు. అవసరాలకు ధనం అందుతుంది. వారం మధ్యలో విజయముంది. చంచలత్వం వద్దు. ఇష్టదేవతను తలచుకుంటే మంచిది.
మనోబలం అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. కోరికలు నెరవేరతాయి. దృఢచిత్తంతో, ధర్మమార్గంలో చేసే పనులు విజయవంతమవుతాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. వ్యాపారంలో జాగ్రత్త. సూర్య ధ్యానం శుభప్రదం.
ముఖ్యకార్యాల్లో శ్రద్ధ పెంచాలి. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. సౌమ్యంగా మాట్లాడాలి. అడుగడుగునా ఆటంకాలుంటాయి, తెలివిగా అధిగమించాలి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా తగిన ప్రణాళికలు సిద్ధం చేయండి. వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేయవద్దు. ఏ నిర్ణయమైనా కుటుంబ సభ్యుల సలహాతో తీసుకుంటే మేలుచేస్తుంది. నవగ్రహ శ్లోకాలు చదువుకోండి, శుభం జరుగుతుంది.
శుభకాలం నడుస్తోంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకుని అభివృద్ధిని సాధించండి. ఉద్యోగపరంగా అభివృద్ధీ ప్రశంసలూ ఉంటాయి. ఎదురుచూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. దివ్యమైన ఆలోచనలు వస్తాయి. సమాజంలో మంచి పేరు లభిస్తుంది. ఆర్థికంగా అభివృద్ధి సూచితం. బంగారు భవిష్యత్తును సాధిస్తారు. లక్ష్మీధ్యానం మంచిది.
ఉద్యోగంలో ప్రశంసలుంటాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారంలో ఏకాగ్రత అవసరం. ఎవరినీ నమ్మవద్దు. స్వయంగా చేసే పనులు శక్తినిస్తాయి. ధన లాభముంది. సందేహించకుండా నిర్ణయాలు తీసుకోవాలి. కాలం వృథా చేయకుండా పనిచేస్తే విజయముంటుంది. సాహస కార్యాలు చేయవద్దు. దుర్గారాధన ఉత్తమం.
గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. మీరు అనుకున్న విధంగానే ముందుకుసాగండి. అవరోధాలను సునాయాసంగా దాటగలరు. సంకల్పం బలంగా ఉండాలి. చెడు ఆలోచనలు రానివ్వవద్దు. ఈర్ష్యపడే వారుంటారు. ఆదిత్యహృదయం చదివితే మనశ్శాంతి లభిస్తుంది.
మనోబలం ముందుకు నడిపిస్తుంది. ముఖ్య కార్యాలను వాయిదా వేయటం మంచిది. కాలం సహకరించటం లేదు. పొరపాటు జరిగితే సమస్య జటిలమవుతుంది. ఆత్మవిశ్వాసంతో విధులను నిర్వర్తించాలి. చంచలత్వం లేకుండా జాగ్రత్తపడాలి. శాంతంగా ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. విఘ్నాలు అధికమవుతాయి. నవగ్రహ స్తోత్రం చదివితే మంచిది.
కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. లక్ష్యాన్ని చేరుకుంటారు. అదృష్టవంతులవుతారు. కీర్తి ప్రతిష్ఠలు ఉంటాయి. ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది. వ్యాపారం మిశ్రమంగా ఉంటుంది. శ్రద్ధ పెంచితే అధిక లాభాలు ఉంటాయి. ఇంట్లోవారి సలహాలు అమలు చేయండి. బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు. విశ్రాంతి అవసరం. శుభవార్త వింటారు. సూర్య నమస్కారం ఉత్తమం.
అత్యంత శ్రేష్ఠమైన కాలం. తిరుగులేని ఫలితాలు సాధిస్తారు. ఘనకీర్తిని పొందుతారు. ఉద్యోగ ఫలితాలు ఆత్మస్థైర్యాన్ని పెంచుతాయి. కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోండి. ప్రయత్నాలు సఫలమవుతాయి. బంగారు జీవితం లభిస్తుంది. వ్యాపారబలం ఉంది. ఆర్థికంగా కలిసొస్తుంది. సంపద పెరుగుతుంది. లక్ష్మీధ్యానం శుభప్రదం.
ఉద్యోగ ఫలితాలు మిశ్రమం. దేనికీ వెనుకాడవద్దు. ధైర్యంగా ముందడుగు వేయాలి. దైవానుగ్రహం ఉంది. ధన ధాన్య లాభముంటుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో సమస్య రానివ్వద్దు. స్థిరాస్తి పెరుగుతుంది. బంధువులవల్ల మంచి జరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. విష్ణు సహస్రనామం చదివితే మంచిది.
మంచి కాలం నడుస్తోంది. అద్భుతమైన తెలివితేటలతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఆశయం నెరవేరుతుంది. ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. పెద్దల అనుగ్రహం సిద్ధిస్తుంది. ఆర్థికంగా విశేష లాభాలుంటాయి. సంకల్పం నెరవేరుతుంది. ఎదురుచూస్తున్న పని ఒకటి పూర్తి అవుతుంది. ఆనందించే అంశముంటుంది. ఇష్టదేవతా సందర్శనం మనశ్శాంతినిస్తుంది.
ఉద్యోగ ఫలితం అద్భుతం. ధర్మ మార్గంలో విజయం సాధిస్తారు. అవరోధాలు తొలగుతాయి. ఆర్థికస్థితి బాగుంటుంది. వ్యాపారరీత్యా పట్టువిడుపులతో పని చేయండి. స్వల్ప సమస్యలున్నా అంతిమంగా కలిసి వస్తుంది. మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి. నవగ్రహ శ్లోకాలు చదివితే మేలు జరుగుతుంది.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
-
-
సినిమా
-
ప్రముఖులు
-
సెంటర్ స్ప్రెడ్
-
ఆధ్యాత్మికం
-
స్ఫూర్తి
-
కథ
-
జనరల్
-
సేవ
-
కొత్తగా
-
పరిశోధన
-
కదంబం
-
ఫ్యాషన్
-
రుచి
-
వెరైటీ
-
అవీ.. ఇవీ
-
టిట్ బిట్స్
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
-
World News
Pakistan: అగ్ర దేశాలకు ‘డంపింగ్ యార్డు’గా మారిన పాకిస్థాన్!
-
India News
Manish Sisodia: దిల్లీ ఉప ముఖ్యమంత్రిపై పరువు నష్టం దావా వేసిన అస్సాం సీఎం
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
EV charging station: హైదరాబాద్ చుట్టుపక్కల 330 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు.. ప్రయోగాత్మకంగా ఇక్కడే!
-
India News
Prisoners List: పాక్ చెరలో ఉన్న భారతీయ ఖైదీల సంఖ్య ఎంతో తెలుసా!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS TET Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- Pakka Commercial Review: రివ్యూ: పక్కా కమర్షియల్
- Tollywood movies: ఏంటి బాసూ.. ఇలాంటి మూవీ తీశావ్..!
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్లో ఉత్పత్తి నిలిపివేత!
- Meena: అసత్య ప్రచారం ఆపండి.. మీనా భావోద్వేగ లేఖ
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Uddhav thackeray: ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Nupur Sharma: నుపుర్ శర్మ దేశానికి క్షమాపణలు చెప్పాలి
- ఈ మార్పులు.. నేటి నుంచి అమల్లోకి..