నేటి నుంచి సాగర్‌, శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణం

నాగార్జునసాగర్‌, శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణం సోమవారం ప్రారంభమవుతోంది. ప్రస్తుతం సాగర్‌ నీటిమట్టం 588.80 అడుగులు ఉండడంతో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి

Updated : 29 Nov 2021 06:43 IST

నాగార్జునసాగర్‌, న్యూస్‌టుడే: నాగార్జునసాగర్‌, శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణం సోమవారం ప్రారంభమవుతోంది. ప్రస్తుతం సాగర్‌ నీటిమట్టం 588.80 అడుగులు ఉండడంతో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ టూర్‌కు పచ్చజెండా ఊపింది. సోమవారం ఉదయం 9 గంటలకు సాగర్‌ నుంచి బయలుదేరే లాంచీ సాయంత్రం 3 గంటలకు శ్రీశైలానికి చేరుతుంది. ఆ రాత్రి అక్కడే బసచేసి దైవ దర్శనం, దర్శనీయ స్థలాల సందర్శన తరువాత మంగళవారం ఉదయం 9 గంటలకు శ్రీశైలం నుంచి బయలుదేరుతుంది. సాయంత్రం 3 గంటలకు లాంచీ సాగర్‌కు చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రయాణానికి ఆదివారం సాయంత్రం వరకు 60 టికెట్లు బుక్‌ అయినట్లు పేర్కొన్నారు. గరిష్ఠంగా 150 టికెట్లకు అవకాశం ఉంటుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని