ఒమిక్రాన్‌పై విమానాశ్రయంలో అప్రమత్తం

ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు దేశంలోనూ నమోదవడంతో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. విదేశాల నుంచి విజయవాడ విమానాశ్రయానికి చేరకునే ప్రయాణికులందరికీ

Updated : 04 Dec 2021 06:30 IST

ప్రయాణికులకు కొవిడ్‌ పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు దేశంలోనూ నమోదవడంతో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. విదేశాల నుంచి విజయవాడ విమానాశ్రయానికి చేరకునే ప్రయాణికులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇద్దరు వైద్యాధికారులు, 15 మంది పారామెడికల్‌ సిబ్బందికి విధులు కేటాయించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా వారంలో మూడ్రోజుల పాటు (మంగళ, శుక్ర, శని) మస్కట్‌, బహ్రెయిన్‌, కువైట్‌కు ప్రయాణికులు వెళ్తారు. ఇక్కడి నుంచి ప్రయాణమయ్యే వారు 72 గంటల లోపు కొవిడ్‌ నిర్ధారణ ఆర్టీపీసీఆర్‌ పరీక్ష, రెండు డోసుల వ్యాక్సినేషన్‌ ధ్రువపత్రాలు తప్పనిసరిగా విమానాశ్రయంలో చూపాలి. లేనిపక్షంలో వారిని అడ్డుకుంటారు. మస్కట్‌, కువైట్‌, కౌలాలంపూర్‌, దుబాయ్‌ నుంచి నిత్యం ఒకటి లేదా రెండు విదేశీ సర్వీసులు వస్తాయి. ప్రయాణికులకు విమానాశ్రయంలోనే ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహిస్తారు. అనంతరం హోం ఐసోలేషన్‌లో వారం రోజుల పాటు ఉండేలా సూచనలిస్తారు. రాష్ట్రానికి చేరిన ప్రయాణికుల ఇంటి సమీపంలోని ఆరోగ్య కార్యకర్తకు సమాచారమిస్తారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

24 గంటల్లో ఫలితాలు

విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేస్తున్నాం. సేకరించిన నమూనాలకు సంబంధించి 24 గంటల్లో ఫలితం వచ్చేలా చర్యలు చేపట్టాం. శుక్రవారం మస్కట్‌ నుంచి వచ్చిన 141 మందికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించాం.

- వై.సురేష్‌, విమానాశ్రయం   వైద్య విభాగ నోడల్‌ అధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని