Ap news:సమ్మిళిత, సమతుల వృద్ధికే 3 రాజధానులు

రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో సమ్మిళిత, సమతుల వృద్ధికి మూడు రాజధానులు ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోందని ఆర్థిక, ప్రణాళికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. ప్రాంతీయ అసమానతలను తొలగించి, అభివృద్ధి ఫలాల్ని

Updated : 18 Mar 2022 06:17 IST

ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

బడ్జెట్‌ సమావేశాలు ముగిసేలోగా విస్తృత చర్చ

సభాపతి తమ్మినేని సీతారాం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో సమ్మిళిత, సమతుల వృద్ధికి మూడు రాజధానులు ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోందని ఆర్థిక, ప్రణాళికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. ప్రాంతీయ అసమానతలను తొలగించి, అభివృద్ధి ఫలాల్ని చివరి లబ్ధిదారుడి దాకా చేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్రంలో 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి వీలుగా ప్రాంతీయ అసమానతలను తొలగించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటి? అని సభ్యులడిగిన ప్రశ్నకు మంత్రి బుగ్గన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ‘రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధికి, సమాజంలోని నిరుపేదలు, సన్నకారు, వెనుకబడిన, నిస్సహాయ వర్గాల కోసం అనేక పథకాలు అమలవుతున్నాయి. పరిపాలనను పౌరులకు దగ్గరకు తీసుకెళ్లి, సామాన్యులనూ ప్రధాన అభివృద్ధి స్రవంతిలోకి తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వికేంద్రీకరణను అవలంబించింది. వికేంద్రీకృత అభివృద్ధిపై దృష్టి సారించి, 26 జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది’ అని మంత్రి పేర్కొన్నారు. సభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ... మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధి, ఇతర అంశాలపై సభ్యులు ధర్మాన ప్రసాదరావు, గోవర్ధన్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, నాగార్జున, జోగి రమేష్‌ అడిగిన ప్రశ్నలపై చర్చను మరోరోజు చేపడతామన్నారు. మిగిలిన సభ్యులూ ఈ అంశంపై విస్తృత చర్చ అవసరమని అభిప్రాయపడినట్లు తెలిపారు. బడ్జెట్‌ సమావేశాలు ముగిసేలోగా ఈ అంశం గురించి విస్తృత స్థాయిలో చర్చించేందుకు అనుమతిస్తానని ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు