సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో చర్చలు నేడు

కాంట్రిబ్యూటరీ పింఛను పథకం(సీపీఎస్‌)పై సచివాలయంలో గురువారం సాయంత్రం 5గంటలకు ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం, ఆర్థికశాఖ అధికారులు చర్చలు జరపనున్నారు. ఏపీ ఎన్‌జీఓ, సచివాలయ ఉద్యోగుల

Published : 18 Aug 2022 04:23 IST

ఈనాడు, అమరావతి: కాంట్రిబ్యూటరీ పింఛను పథకం(సీపీఎస్‌)పై సచివాలయంలో గురువారం సాయంత్రం 5గంటలకు ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం, ఆర్థికశాఖ అధికారులు చర్చలు జరపనున్నారు. ఏపీ ఎన్‌జీఓ, సచివాలయ ఉద్యోగుల సంఘం, రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌, ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలతోపాటు సీపీఎస్‌ ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించారు. మొదటిసారిగా సీపీఎస్‌ ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచారు. చర్చలకు జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో సభ్యత్వం ఉన్న ఉపాధ్యాయ సంఘాలను ఆహ్వానించకపోవడం సరికాదని ఏపీటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హృదయరాజు, చిరంజీవి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని