భూ రక్షా?.. భూ భక్షా?

పాత పట్టాదారు పాసు పుస్తకాల్లో ఉన్న భూవిస్తీర్ణం వివరాలు.. కొత్తగా ఇచ్చిన శాశ్వత భూహక్కు పత్రాల్లో లేకపోవడాన్ని చూసి రైతులు విస్తుబోతున్నారు.

Updated : 26 Nov 2022 05:21 IST

కొత్త పాస్‌ పుస్తకాల్లో తగ్గిన విస్తీర్ణం  

ఈనాడు, చిత్తూరు, న్యూస్‌టుడే, చిత్తూరు కలెక్టరేట్‌: పాత పట్టాదారు పాసు పుస్తకాల్లో ఉన్న భూవిస్తీర్ణం వివరాలు.. కొత్తగా ఇచ్చిన శాశ్వత భూహక్కు పత్రాల్లో లేకపోవడాన్ని చూసి రైతులు విస్తుబోతున్నారు. చిత్తూరులో శుక్రవారం నిర్వహించిన ‘వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం’లో భాగంగా భూ యజమానులకు కొత్త పాసు పుస్తకాలు అందజేశారు. అందులో కొందరికి కొత్త పుస్తకాల్లో భూ విస్తీర్ణం తక్కువగా చూపడంతో వారు ఖంగుతిన్నారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం పాపసముద్రం గ్రామానికి చెందిన రైతు ధనరాజులుకు పాత పాసుపుస్తకంలో 307 సర్వే నంబరులో 64 సెంట్లు ఉంది. కానీ కొత్త పాసుపుస్తకంలో 58 సెంట్లు మాత్రమే ఉన్నట్లు చూపారు. తనకు 6 సెంట్ల భూమి తగ్గిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అదే మండలానికి చెందిన పలువురు రైతుల భూముల్లో 2 నుంచి 10 సెంట్ల వరకు తగ్గిందని ఆందోళన చెందుతున్నారు. పూతలపట్టు మండలం సిద్ధలింగనపల్లెకు చెందిన రైతు రామచంద్రారెడ్డికి.. 15/1ఏ సర్వేలో పాత రికార్డులో 1.26 ఎకరాలు ఉండగా.. కొత్త పుస్తకంలో 10 సెంట్లు తగ్గి 1.16 ఎకరాలుగా నమోదవడంతో ఏంచేయాలో పాలుపోక తలపట్టుకున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని