నవంబరు జీఎస్‌టీ వసూళ్లు రూ.1.45 లక్షల కోట్లు

వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) కింద నవంబరులో రూ.1,45,867 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థికశాఖ గురువారం వెల్లడించింది.

Updated : 02 Dec 2022 05:26 IST

తెలంగాణలో 8%, ఏపీలో 14% వృద్ధి

ఈనాడు, దిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) కింద నవంబరులో రూ.1,45,867 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థికశాఖ గురువారం వెల్లడించింది. గత ఏడాది నవంబరుతో పోలిస్తే 11% వృద్ధి నమోదైనట్లు పేర్కొంది. వసూళ్లు రూ.1.40 లక్షల కోట్లను దాటడం వరుసగా ఇది తొమ్మిదో నెల. నవంబరు నెలలో జీఎస్‌టీ వసూళ్లలో తెలంగాణ 8%, ఆంధ్రప్రదేశ్‌ 14% వృద్ధి నమోదుచేశాయి. గత ఏడాది నవంబరులో తెలంగాణకు రూ.3,931 కోట్లు రాగా, ఈసారి రూ4,228 కోట్లకు చేరింది. ఆంధ్రప్రదేశ్‌ వసూళ్లు రూ.2,750 కోట్ల నుంచి రూ.3,134 కోట్లకు పెరిగాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక 13%, తమిళనాడు 10%, పుదుచ్చేరి 22% వృద్ధిరేటు నమోదుచేయగా, కేరళ ఆదాయం మాత్రం గత ఏడాది నవంబరుకంటే ఈసారి 2% తగ్గింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు