Andhra News : సీఎం కుటుంబానికి విదేశాల్లోనూ భద్రత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వారి భార్య/భర్త, పిల్లలు, తల్లిదండ్రులు ఎక్కడున్నా సరే వారికి అత్యంత సమీపం నుంచి భద్రత (ప్రాక్స్‌మేట్ సెక్యూరిటీ) కల్పించేందుకు వీలుగా ప్రత్యేక భద్రతా గ్రూపు (ఎస్ఎస్జీ) బిల్లును రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
ముఖ్యమంత్రి దంపతులు, పిల్లలు, తల్లిదండ్రులకు వర్తింపు
ఎస్ఎస్జీ బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వారి భార్య/భర్త, పిల్లలు, తల్లిదండ్రులు ఎక్కడున్నా సరే వారికి అత్యంత సమీపం నుంచి భద్రత (ప్రాక్స్‌మేట్ సెక్యూరిటీ) కల్పించేందుకు వీలుగా ప్రత్యేక భద్రతా గ్రూపు (ఎస్ఎస్జీ) బిల్లును రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ముఖ్యమంత్రి, వారి సమీప కుటుంబ సభ్యులైన భార్య/భర్త, పిల్లలు, తల్లిదండ్రులకు విదేశాల్లో సైతం ప్రభుత్వం రక్షణ కల్పించనుంది. ఈ మేరకు అవసరమైన భద్రతపరమైన సేవలు అందించేందుకు ఎస్‌ఎస్‌జీలోని సభ్యులు కట్టుబడి ఉండాలని బిల్లులో పేర్కొంది. ‘‘ముఖ్యమంత్రి, వారి భార్య/భర్త, పిల్లలు, తల్లిదండ్రులకు ఇంట్లోనూ, ప్రయాణ సమయంలోనూ, ఎక్కడైనా బస చేసినప్పుడు, ఎక్కడికైనా వెళ్లినప్పుడు, వేడుకులు, కార్యక్రమాలకు హాజరైనప్పుడు ఇలా అన్ని సందర్భాల్లోనూ ఎస్ఎస్జీ రక్షణ కల్పిస్తుంది. వాహనాల్లో, రైల్లో, విమానాల్లో, నౌకల్లో ప్రయాణించినప్పుడు, కాలినడకన వెళ్లినప్పుడు కూడా ఈ ప్రత్యేక బృందం వారి వెన్నంటే ఉంటూ వారి చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తుంది. భద్రతాపరంగా అవసరమైన కట్టడి నిబంధనలనూ అమలు చేస్తుంది. వారి సమీపంలోకి ఎవరైనా రావాలన్నా నియంత్రిస్తుంది. ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం ఈ ప్రత్యేక భద్రతా గ్రూపు (ఎస్ఎస్జీ) బాధ్యతలను చూస్తుంది. దీనిలో పనిచేయటానికి పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లోని సిబ్బందిని డిప్యుటేషన్ ప్రాతిపదికన తీసుకుంటారు. వారికి ప్రత్యేకంగా శిక్షణ కేంద్రం ఏర్పాటు కానుంది. ఎస్ఎస్జీ గ్రూపులోని సభ్యులు విధి నిర్వహణలో భాగంగా చేపట్టే పనులకు న్యాయపరమైన రక్షణ (లీగల్ ఇమ్యూనిటీ) ఉంటుంది’’ అని రాష్ట్ర ప్రభుత్వం బిల్లులో పొందుపరిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేరాంధ్రప్రదేశ్!
-
తుపాన్లకు పేర్లు పెట్టేందుకూ ఓ విధానం
తీరం వైపు దూసుకొస్తున్న మిగ్జాం తుపాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లను కుదిపేస్తోంది. రెండు రాష్ట్రాలను ఇంతగా వణికిస్తున్న ఈ తుపానుకు మిగ్జాం అనే పేరును మయన్మార్ సూచించింది. ఈ పేరుకు అర్థం.. బలం, పుంజుకునే శక్తి అని వెల్లడించింది. -
పీఎంఆర్పీవై కింద రూ.228.10 కోట్ల పంపిణీ
ప్రధానమంత్రి రోజ్‌గార్ ప్రోత్సాహన్ యోజన (పీఎంఆర్పీవై) కింద ఆంధ్రప్రదేశ్‌కు 2016-17 నుంచి 2021-22 వరకు రూ.228.10 కోట్లను సబ్సిడీ కింద పంపిణీ చేసినట్లు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి తెలిపారు. -
‘గుండె’ గోడు వినపడదా..?
తాను పుట్టిందే పేదల్ని ఉద్ధరించడానికి అన్నట్లు స్వయంగా గొప్పలు చెప్పుకొంటారు. అవకాశం చిక్కితే చాలు సమయం, సందర్భమూ చూడకుండా పేదలు, పెత్తందారులంటూ రాగాలు తీస్తారు. ఆయన ఒక్కరే పేదల పక్షమన్నట్లు, మిగతా వారంతా పెత్తందారులు అన్నట్లు విరుచుకుపడతారు... -
తుపాను సన్నద్ధత ఇదా?
తుపాను విరుచుకు పడుతుందని తెలిస్తే.. ఏ ప్రభుత్వమైనా వారం ముందు నుంచే సహాయ చర్యలపై దృష్టిసారిస్తుంది. పంట నష్టాన్ని తగ్గించడంపై శ్రద్ధ పెడుతుంది. ఘనత వహించిన వైకాపా సర్కారుకు మాత్రం.. తీరం దాటడానికి ఒకటి, రెండు రోజుల ముందే రైతులు గుర్తొస్తారు. -
పునరావాస శిబిరాల్లో ఎలాంటి లోటూ రాకూడదు
తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని వారిని పునరావాస శిబిరాలకు తరలించి, అన్ని సౌకర్యాలూ కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారు. కోసిన పంటను, రంగు మారిన ధాన్యాన్ని కూడా యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేయాలని చెప్పారు. ఖరీఫ్ పంటల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. -
పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు
తీవ్ర తుపాను ‘మిగ్జాం’ తీరానికి సమాంతరంగా కదులుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో గాలుల తీవ్రత పెరిగిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు. తీరానికి చేరువలోకి వచ్చేసరికి 90-112 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయన్నారు. -
అన్నదాతల్లో తుపాను కలవరం
తుపాను తీరానికి దగ్గరయ్యే కొద్దీ రైతుల్లో ఆందోళన అధికమవుతోంది. ఈదురుగాలుల ధాటికి కోతకు సిద్ధంగా ఉన్న లక్షల ఎకరాల్లో వరి.. నేలవాలుతోంది. వర్షాలు, గాలుల తీవ్రత పెరిగితే చేతికి దక్కదేమో అనే భయం వారిని వెన్నాడుతోంది. -
పట్టుబట్టి.. పేదల పొట్టకొట్టి..!
యువతకు ఉపాధినిచ్చే పరిశ్రమలైనా.. అట్టడుగు వర్గాలకు అండగా నిలిచే ప్రత్యేక పథకాలైనా.. పాలనా సౌకర్యం కోసం నిర్మించుకున్న ప్రజావేదికైనా.. ఆఖరికి పేదల కడుపు నింపే ‘అన్న క్యాంటీన్’ అయినా.. ఏదైనా సరే.. కూలిపోవడమో.. తరలిపోవడమో.. -
పేరులో చిన్న.. సెటిల్మెంట్లలో ‘పెద్ద’
‘యథా రాజా తథా ప్రజా’... ఈ మాటల్ని ‘యథా బడా నేత తథా ఛోటా నేత’గా అన్వయించుకుంటున్నారు వైకాపా నాయకులు. జగన్ సీఎం అయ్యాక ఇదివరకెన్నడూ లేనంతగా సెటిల్మెంట్లు, బెదిరింపుల సంస్కృతి జిల్లాలకూ పాకింది. వివాదం అని తెలిస్తే చాలు... -
తిరుమలలో వర్షాలు
తుపాను ప్రభావంతో తిరుమలలో కురుస్తున్న వర్షాలు, పొగమంచుతో భక్తులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సోమవారం శ్రీవారి దర్శనానికి వచ్చిన తిరుపతికి చెందిన భక్తుడు విజయ్‌కుమార్ జారి కిందపడటంతో కాలు విరిగింది. -
ఛార్టర్డ్ అకౌంటెంట్ వృత్తికి మచ్చ తెచ్చిన విజయసాయిరెడ్డి
వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఛార్టర్డ్ అకౌంటెంట్‌గా వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) క్రమశిక్షణ కమిటీ ప్రాథమికంగా నిర్ధారించింది. -
ఇప్పటికైనా మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి: అమరావతి రైతులు
రాష్ట్ర రాజధాని అమరావతిగా కేంద్రం మరోసారి పేర్కొందని, ఇప్పటికైనా సీఎం జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అమరావతి అన్నదాతలు కోరారు. -
7 గంటల్లోనే ఆర్యూబీ నిర్మాణం
విశాఖ-విజయనగరం రైలు మార్గంలో కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద 477 రైల్వే లెవెల్ క్రాసింగ్ (గేటు) స్థానంలో రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) నిర్మాణాన్ని కేవలం ఏడు గంటల్లో పూర్తిచేశారు. -
మరుగుదొడ్లకు తలుపులు లేవ్
‘మరుగుదొడ్లకు తలుపులు లేవు. కరెంటు లేకపోతే నీళ్లు రావు. దీని గురించి ప్రిన్సిపల్ పట్టించుకోవడం లేదు. లేనిపోని నిబంధనలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. -
వ్యాపార రిజిస్ట్రేషన్లకు సేవాకేంద్రాలు
రాష్ట్రంలో వ్యాపారులు వస్తు సేవల పన్నుకు (జీఎస్టీ) సంబంధించిన రిజిస్ట్రేషన్లు, పన్నులు చెల్లించడాన్ని మరింత సులభతరం చేసేందుకు ప్రత్యేక సేవాకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి తెలిపారు. గుజరాత్, పాండిచ్చేరితోపాటు ఏపీలో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ జీఎస్టీ సేవా కేంద్రాలను నెలకొల్పామని మంత్రి వెల్లడించారు. -
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. దాని మాస్టర్‌ప్లాన్‌కు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆమోదముద్ర వేసినట్లు వెల్లడించింది. ‘పట్టణ పరిపాలన, నగరాల దీర్ఘకాల అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ అత్యవసరం. -
చేతకానప్పుడు చెప్పడం దేనికి?
వైకాపా ప్రభుత్వానికి నిరుద్యోగులంటే లెక్కే లేదు. ఇవిగో పోస్టులు... ఇచ్చేస్తున్నాం నోటిఫికేషన్లు అంటూ... ఊరించి మోసగిస్తోంది. అసలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీనే తక్కువ. అరకొరగా ప్రకటించిన కొలువుల భర్తీకీ అతీగతీ లేదు. -
‘మీరు పావలా.. అర్ధ రూపాయికీ పనికిరారు’
‘పిచ్చిపిచ్చిగా ఉందా.. ఏమి ఒళ్లు బద్ధకమా.. చెబితే అర్థం కాదా యూజ్లెస్ ఫెలోస్.. పావలా.. అర్ధ రూపాయికీ పనికిరారు’ అంటూ కర్నూలు నగరపాలక సంస్థకు చెందిన ఓ అధికారి వార్డు సచివాలయ అడ్మిన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విశాఖ స్టీల్‌కు రూ.2,058 కోట్ల నష్టం
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో పన్ను చెల్లింపునకు ముందు రూ.2,268 కోట్లు, పన్ను చెల్లించిన తర్వాత రూ.2,058 కోట్ల నష్టం వచ్చినట్లు కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి ఫగన్‌సింగ్ కులస్థే తెలిపారు. -
అలల కల్లోలం
మిగ్జాం తుపాను.. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిపిస్తూ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో అలజడి రేపుతోంది. చెన్నై నగరంతో పాటు.. తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఇప్పటికే వందల గ్రామాలు అతలాకుతలం అవుతున్నాయి. రహదారులపైకి నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి.


తాజా వార్తలు (Latest News)
-
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే
-
‘మీరు పావలా.. అర్ధ రూపాయికీ పనికిరారు’
-
Vishal: మేం అలాంటి పరిస్థితిలో లేం..: జీసీసీపై విశాల్ అసహనం
-
Nani: మహేశ్ బాబుతో మల్టీస్టారర్.. నాని ఆన్సర్ ఏంటంటే?
-
Jairam Ramesh: ‘ఆ మూడు బిల్లులు ప్రమాదకరం..! వాటిని వ్యతిరేకిస్తాం’
-
Live Bomb: ఇంటి పెరట్లోనే బాంబు.. దంపతులు షాక్..!