బేబినాయన పాదయాత్ర భగ్నం

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా విజయనగరం జిల్లా బొబ్బిలిలోని వేణుగోపాలస్వామి ఆలయం నుంచి సింహాచలంకు శుక్రవారం పాదయాత్ర చేపట్టాలని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బేబినాయనను పోలీసులు అడ్డుకున్నారు.

Updated : 23 Sep 2023 06:34 IST

ఈనాడు, విజయనగరం, బొబ్బిలి, న్యూస్‌టుడే: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా విజయనగరం జిల్లా బొబ్బిలిలోని వేణుగోపాలస్వామి ఆలయం నుంచి సింహాచలంకు శుక్రవారం పాదయాత్ర చేపట్టాలని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బేబినాయనను పోలీసులు అడ్డుకున్నారు. ఆయనతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి మెరకముడిదాం బుదరాయవలస పోలీసుస్టేషన్‌కు తరలించారు. పాదయాత్రలో పాల్గొనేందుకు సిద్ధమైన సమీప నియోజకవర్గాల్లోని సీనియర్‌ నాయకులను పోలీసులు ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు బేబినాయన సహా నాయకులు, కార్యకర్తలను విడుదల చేశారు. పాదయాత్రను భగ్నం చేయడంతో పట్టణంలో తెదేపా శ్రేణులు ఆందోళన చేపట్టాయి. వర్తకులు దుకాణాలను మూసివేశారు. రాష్ట్రంలో పాలకుల దుర్మార్గపు పనులకు అక్రమ అరెస్టులు, నిర్బంధాలు అద్దంపడుతున్నాయని మాజీ మంత్రి ఆర్‌వీ సుజయకృష్ణ రంగారావు ధ్వజమెత్తారు.
బేబి నాయనను పోలీసులు అరెస్టు చేయడం ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ప్రయత్నమని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్‌గజపతిరాజు ధ్వజమెత్తారు. తెదేపా నాయకులను గృహనిర్బంధం, అరెస్టు చేయడాన్ని ఖండించారు. వారేమీ జగన్‌లా దొంగతనం చేయలేదని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని