Gundlakamma Project: గడ్డి మూటలకు లొంగవమ్మా.. గుండ్లకమ్మ!

గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు నుంచి జలాలు వృథాగా పోతూనే ఉన్నాయి. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరంలో మూడు రోజుల క్రితం ప్రాజెక్టు గేటు ఒకటి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే.

Updated : 12 Dec 2023 07:29 IST

గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు నుంచి జలాలు వృథాగా పోతూనే ఉన్నాయి. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరంలో మూడు రోజుల క్రితం ప్రాజెక్టు గేటు ఒకటి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. నీరు దిగువకు పోకుండా అడ్డుకట్ట వేసేందుకు ఇంజినీరింగ్‌ యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. మొదట స్టాప్‌లాక్‌ ఏర్పాటుకు యత్నించి విఫలమయ్యారు. తరువాత విరిగిన గేటు వెనుక దానిని అమర్చినా.. గేటుకు, స్టాప్‌లాక్‌కు మధ్య ఖాళీ ఎక్కువగా ఉండడంతో పెద్ద మొత్తంలో నీరు వృథాగా దిగువకు పోతోంది. ఆదివారం ఎండిన కొమ్మలు, కర్రలను గోనె సంచుల్లో మూటలుగా కట్టి ఆ ఖాళీలో వేయగా అవి వెంటనే కొట్టుకుపోయాయి. సోమవారం.. కర్రలు అమర్చి, దానిపై ఎండుగడ్డి మూటలు.. ఇసుక బస్తాలు వేశారు. పది నిమిషాల్లోనే అవి కొట్టుకుపోవడంతో యథాతథంగా నీరు వృథాగా పోతోంది.

ఈనాడు, ఒంగోలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని