Tadepalli: పెత్తం‘దారి’ ఇలా.. పేదలు సాగేదెలా

గుంటూరు జిల్లా తాడేపల్లి భరతమాత బొమ్మ కూడలి నుంచి సీఎం జగన్‌ క్యాంపు కార్యాలయానికి వెళ్లే రహదారి చూడండి.. రూ.కోట్లు ఖర్చు చేసి విశాలంగా నాలుగు వరుసలతో, డివైడర్‌ మధ్యలో విద్యుత్‌ లైట్లు, పచ్చదనంతో తీర్చిదిద్దారు.

Updated : 31 Jan 2024 07:29 IST

గుంటూరు జిల్లా తాడేపల్లి భరతమాత బొమ్మ కూడలి నుంచి సీఎం జగన్‌ క్యాంపు కార్యాలయానికి వెళ్లే రహదారి చూడండి.. రూ.కోట్లు ఖర్చు చేసి విశాలంగా నాలుగు వరుసలతో, డివైడర్‌ మధ్యలో విద్యుత్‌ లైట్లు, పచ్చదనంతో తీర్చిదిద్దారు. మరోవైపు జనాలు వెళ్లే కట్ట రహదారి చూడండి.. మూడున్నరేళ్లుగా రాకపోకలు నిలిపేసి మట్టితో, వీధి దీపాలు లేకుండా ఎంత అధ్వానంగా ఉందో! భరతమాత బొమ్మ కూడలి నుంచి కుంచనపల్లి, వడ్డేశ్వరం, రేవేంద్రపాడు వెళ్లే రహదారి మూసేయడంతో ప్రజలు 1.5 కి.మీ చుట్టూ తిరిగి సర్వీసు రోడ్డు మీదుగా వెళ్లాల్సి వస్తోంది. కట్టమీద రహదారికి.. సీఎం క్యాంపు కార్యాలయం దారికి సంబంధం లేకుండా ఇనుపగ్రిల్స్‌తో పటిష్టమైన కంచె వేస్తున్నారు. రోడ్డు బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని