కేంద్ర పన్నుల్లో ఏపీకి రూ.49,364 కోట్లు

కొత్త ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల్లో వాటా కింద ఏపీకి రూ.49,364 కోట్లు, తెలంగాణకు రూ.25,639 కోట్లు రానున్నాయి.

Updated : 02 Feb 2024 06:38 IST

ఈనాడు, దిల్లీ: కొత్త ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల్లో వాటా కింద ఏపీకి రూ.49,364 కోట్లు, తెలంగాణకు రూ.25,639 కోట్లు రానున్నాయి. 2023-24 బడ్జెట్‌ కంటే ఏపీకి రూ.4,666 కోట్లు, తెలంగాణకు రూ.2,423 కోట్లు ఎక్కువ మొత్తం రానుంది. 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన దామాషాను అనుసరించి మొత్తం కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 4.047%, తెలంగాణకు 2.102% వాటాను కేంద్రం పంపిణీ చేస్తోంది. ఆర్థిక మంత్రి పొందుపరిచిన పద్దుల ప్రకారం అన్ని రాష్ట్రాలకు కలిపి.. గతం కంటే రూ.1,15,289 కోట్లు (10.43%) అధిక మొత్తం రానుంది. జీఎస్టీ పరిహారం లోటును భర్తీ చేయడానికి 2020-21, 2021-22ల్లో ఆంధ్రపదేశ్‌కు రూ.5,583.19 కోట్లు, తెలంగాణకు రూ.6,949.49 కోట్ల మేర రుణం ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని