APSRTC: ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

అసలే సింగిల్‌ రోడ్డు.. ఆపై ఇరువైపులా మోకాలి లోతున కోతలు పడిన దారులు.. ఈ అధ్వాన దారులకు తోడు డొక్కు బస్సు.. రోడ్డు దిగి ఎక్కాలంటే ఆపసోపాలు.. ప్రయాణికులకు తృటిలో పెనుప్రమాదం తప్పింది.

Updated : 14 Feb 2024 07:50 IST

యాక్సిల్‌ విరిగి బయటకు వచ్చిన చక్రాలు

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: అసలే సింగిల్‌ రోడ్డు.. ఆపై ఇరువైపులా మోకాలి లోతున కోతలు పడిన దారులు.. ఈ అధ్వాన దారులకు తోడు డొక్కు బస్సు.. రోడ్డు దిగి ఎక్కాలంటే ఆపసోపాలు.. ప్రయాణికులకు తృటిలో పెనుప్రమాదం తప్పింది. యాక్సిల్‌ విరిగి వెనక చక్రాలు బయటకు వచ్చిన బస్సు .. డ్రైవరు చాకచక్యంగా వ్యవహరించడంతో రోడ్డుపైనే ఆగింది. ఈ ఉదంతం అన్నమయ్య జిల్లా మదనపల్లె-రామసముద్రం మార్గంలో మంగళవారం చోటుచేసుకుంది. ఉదయం రామసముద్రం నుంచి మదనపల్లెకు ప్రయాణికులతో వస్తున్న బస్సు బొమ్మనచెరువు, రామాపురం మధ్యలోకి రాగానే వెనక చక్రాలకు సంబంధించిన యాక్సిల్‌ విరిగింది. దీంతో ఒక్కసారిగా బస్సు వెనక టైర్లు ఒక పక్క బయటకు వచ్చేశాయి. అప్రమత్తమైన డ్రైవర్‌ లక్ష్మీపతి బస్సును పక్కన ఆపేశారు. అలాగే వెళ్లి ఉంటే బస్సు బోల్తాపడి పెనుప్రమాదమేర్పడేది. రోడ్డు నిర్వహణ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రయాణికులు దుయ్యబట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు