శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, శివమాల దంపతులు, ఇతర కుటుంబసభ్యులు మంగళవారం దర్శించుకున్నారు.

Updated : 27 Mar 2024 06:21 IST

జస్టిస్‌ హృషికేష్‌రాయ్‌, జస్టిస్‌ దుప్పల వెంకటరమణ కూడా..

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, శివమాల దంపతులు, ఇతర కుటుంబసభ్యులు మంగళవారం దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వారికి మహద్వారం వద్ద తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి స్వాగతం పలికి శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు.

అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం, తితిదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మాజీ సీజేఐ కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.  

శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హృషికేష్‌రాయ్‌, మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దుప్పల వెంకటరమణ కూడా కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. న్యాయమూర్తులకు తితిదే అధికారులు స్వాగతం పలికి శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని