నన్నెవరూ అపహరించలేదు

గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్‌ వేసే క్రమంలో స్వతంత్ర అభ్యర్థి విడదల రజనిని వైకాపా నేతల కనుసన్నల్లో పోలీసులు అడ్డుకొని, నిర్బంధించారంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణను మూసివేసింది.

Published : 30 Apr 2024 05:10 IST

హైకోర్టుకు వెల్లడించిన స్వతంత్ర అభ్యర్థి విడదల రజిని

ఈనాడు, అమరావతి: గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్‌ వేసే క్రమంలో స్వతంత్ర అభ్యర్థి విడదల రజనిని వైకాపా నేతల కనుసన్నల్లో పోలీసులు అడ్డుకొని, నిర్బంధించారంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణను మూసివేసింది. విడదల రజిని, ఆమె భర్త అనురాగరావు సోమవారం హైకోర్టు విచారణకు హాజరయ్యారు. తమను ఎవరూ అపహరించలేదని, బంధువుల ఇంట్లో ఉన్నామని నివేదించారు. ఈ వివరాలను నమోదు చేసిన ధర్మాసనం విచారణను మూసివేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ జె.సుమతిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 25న నామినేషన్‌ దాఖలు చేయడానికి సిద్ధమైన విడదల రజిని అనే ఎస్సీ మహిళను అధికార పార్టీ నేతల ఒత్తిడితో పోలీసులుఅపహరించారని పేర్కొంటూ గుంటూరుకు చెందిన పఠాన్‌ అస్మతుల్లా వ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే.

పులివర్తి నానికి పోలీసు భద్రత కల్పించండి: హైకోర్టు

చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం తెదేపా అభ్యర్థి పులివర్తి వెంకటమణిప్రసాద్‌ (నాని)కు వెంటనే వన్‌ ఫ్లస్‌ వన్‌ సెక్యూరిటీ కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి సోమవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. తిరుపతి జిల్లా ఎస్పీ, తిరుపతి గ్రామీణ ఠాణా పోలీసులు తనకు భద్రత కల్పించకపోవడాన్ని సవాలు చేస్తూ నాని, ఆయన సతీమణి, కుమారుడు హైకోర్టులో వ్యాజ్యం వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని