Adani group: అదానీ చేతికి ట్రైన్‌మ్యాన్‌.. 100% వాటా

Trainman: రైల్వే సమాచారాన్ని అందించే ట్రైన్‌మ్యాన్‌ను అదానీ గ్రూప్‌ కొనుగోలు చేసింది. నూరు శాతం వాటాలను కొనుగోలు చేస్తున్నట్లు ఆ సంస్థ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

Updated : 17 Jun 2023 18:50 IST

దిల్లీ: ఆన్‌లైన్‌ ట్రైన్‌ బుకింగ్‌, ఇన్ఫర్మేషన్‌ పోర్టల్‌ ట్రైన్‌మ్యాన్‌ను (Trainman) అదానీ గ్రూప్‌ (Adani group) కొనుగోలు చేసింది. అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ లిమిటెడ్‌కు చెందిన అనుబంధ సంస్థ అదానీ డిజిటల్‌ ల్యాబ్స్‌ ఈ స్టారప్‌ను దక్కించుకుంది. ఈ మేరకు అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ లిమిటెడ్‌ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. నూరు శాతం వాటా కొనుగోలుకు షేర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నట్లు తెలిపింది. అయితే, ఎంతకు కొనుగోలు చేసిందీ వెల్లడించలేదు.

ఐఐటీ-రూర్కీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వినీత్‌ చిరానియా, కరణ్‌ కుమార్‌ ట్రైన్‌మ్యాన్‌ను స్థాపించారు. ఐఆర్‌సీటీసీ అధీకృత ట్రైన్‌ బుకింగ్‌ స్టారప్‌ అయిన ట్రైన్‌మ్యాన్‌.. రైళ్లలో సీట్ల అందుబాటు, పీఎన్‌ఆర్‌ స్టేటస్‌, లైవ్‌ స్టేటస్‌ వంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుంటుంది. ఇటీవలే అమెరికాకు చెందిన ఇన్వెస్టర్ల నుంచి 1 మిలియన్‌ నిధులను కూడా సమీకరించింది. మరోవైపు ఎయిర్‌లైన్‌ బుకింగ్‌ యాప్‌ క్లియర్‌ ట్రిప్‌లో సైతం 2021లో అదానీ గ్రూప్‌ వాటాలు కొనుగోలుచేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని