Airtel Recharge: ఎయిర్‌టెల్ కనీస రీఛార్జి రూ.155
భారతీ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ కనీస రీఛార్జిని దాదాపు 57 శాతం పెంచి రూ.155 చేసింది. ప్రస్తుతం ఉన్న కనీస రీఛార్జి ప్లాన్ రూ.99ను నిలిపి వేసింది.
ఒకేసారి 57% పెంపు
దిల్లీ: భారతీ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ కనీస రీఛార్జిని దాదాపు 57 శాతం పెంచి రూ.155 చేసింది. ప్రస్తుతం ఉన్న కనీస రీఛార్జి ప్లాన్ రూ.99ను నిలిపి వేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బిహార్, ఉత్తర్ ప్రదేశ్ పశ్చిమ, జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్ సర్కిళ్లలో ఇకపై రూ.155 కనీస ధర అమలవుతుంది.
* రూ.99 పథకం కింద 200 ఎంబీ డేటా ఉచితం కాగా, కాల్‌కు సెకనుకు రూ.2.5 పైసా అయ్యేది.
* రూ.155 ప్లాన్‌లో అపరిమిత కాల్స్, 1జీబీ డేటా, 300 ఎస్‌ఎంఎస్‌లు అందించనున్నట్లు ఎయిర్‌టెల్ తెలిపింది. దీనితో పాటు హలో ట్యూన్, వింక్‌మ్యూజిక్ సేవలు ఉచితమని సంస్థ తెలిపింది. అయితే ఈ పథకం కింద రీఛార్జి చేసుకునేందుకు చూస్తే, కొన్ని ప్రీపెయిడ్ ఫోన్ నంబర్లకు 28 రోజులు, మరికొన్నింటికి 24 రోజుల కాలావధిగా సంస్థ వెబ్‌సైట్‌లో చూపుతుండటం వినియోగదార్లను గందరగోళానికి గురిచేస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
రైళ్లపై రాళ్లేస్తే అయిదేళ్ల శిక్ష.. ద.మ.రైల్వే హెచ్చరిక
-
World News
వీర్యదానంతో 550 మందికి తండ్రైన వైద్యుడు
-
Ts-top-news News
రంగంలోకి కేంద్ర నిఘా సంస్థ.. డేటా లీకేజీ వ్యవహారంలో మలుపులు
-
Crime News
కారుపై ‘పొక్లెయిన్’ పిడుగు!.. ముగ్గురి దుర్మరణం.. ఇద్దరికి తీవ్రగాయాలు
-
Ap-top-news News
పాపికొండల విహారయాత్రకు పచ్చ జెండా
-
Politics News
‘వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేయం’.. ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు తేల్చిచెప్పిన వైకాపా కార్యకర్తలు