Amazon bazaar: లైవ్‌లోకి అమెజాన్‌ బజార్‌.. మీషో, ఫ్లిప్‌కార్ట్‌కు పోటీగానేనా?

అమెజాన్‌ బజార్‌ పేరిట కొత్త వ్యాపార విభాగాన్ని ప్రారంభించింది. ఇందులో తక్కువ ధర కలిగిన ఉత్పత్తులు లభిస్తాయి.

Published : 06 Apr 2024 16:47 IST

Amazon bazaar | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ (Amazon).. కొత్త వ్యాపార విభాగాన్ని ప్రారంభించింది. అన్‌ బ్రాండెడ్‌, తక్కువ ధర కలిగిన ఫ్యాషన్‌, లైఫ్‌ స్టయిల్ ఉత్పత్తుల కోసం ‘బజార్‌’ను తీసుకొచ్చింది. అమెజాన్‌ ఆండ్రాయిడ్ యాప్‌లో లైవ్‌లోకి వచ్చింది. రూ.600లోపు విలువ కలిగిన దుస్తులు, వాచ్‌లు, ఫుట్‌వేర్‌ను అందించడమే లక్ష్యంగా కొత్త వ్యాపార విభాగాన్ని అమెజాన్‌ ప్రారంభించింది.

తక్కువ ధరకే ఫ్యాషన్‌, గృహ ఉత్పత్తులను అందించడం ఈ ‘బజార్‌’ ముఖ్య ఉద్దేశం. చీరలు, కుర్తాలు, షర్టులు, టీషర్టులు, చిన్నపిల్లల దుస్తులు, బెడ్‌షీట్లు, డోర్‌ కర్టెన్స్‌, హ్యాండ్‌ బ్యాగుల వంటి వివిధ కేటగిరీలకు చెందిన ఉత్పత్తులు ఈ స్టోర్‌లో లభిస్తాయి. దేశం నలుమూలలా ఉన్న మానుఫాక్చరింగ్‌ హబ్స్‌ నుంచి సెల్లర్లు తమ ఉత్పత్తులను ఈ బజార్‌ వేదికగా విక్రయిస్తారు. ఇందుకోసం సెల్లర్ల నుంచి ఎలాంటి ఫీజూ వసూలు చేయడం లేదు. వీటి డెలివరీకి మాత్రం అమెజాన్‌ 4-5 రోజుల సమయం తీసుకుంటోంది. సాధారణంగా అమెజాన్‌ ప్రైమ్‌ కస్టమర్లకు ఒకే రోజులో డెలివరీ అందిస్తుంటారు. అన్‌బ్రాండెడ్‌ ఉత్పత్తుల విషయంలో మాత్రం కాస్త అధిక గడువు తీసకుంటోంది.

రూ.6,000-8,000 స్మార్ట్‌ఫోన్ల వైపు..ఫీచర్‌ ఫోన్‌ వినియోగదార్ల చూపు

వాటిపై పోటీకేనా?

ప్రీమియం ఉత్పత్తులను సేమ్‌ డే డెలివరీ చేయడం ద్వారా తనదైన ముద్ర వేసుకున్న అమెజాన్‌.. తక్కువ ధర కలిగిన ఉత్పత్తుల విక్రయంలో మాత్రం వెనకబడింది. ఈ విషయంలో సాఫ్ట్‌బ్యాంక్‌ మద్దతు కలిగిన మీషో దూసుకెళ్తోంది. ఫ్లిప్‌కార్ట్‌ సైతం షాప్సీ పేరిట ఇదేతరహాలో ప్రత్యేక యాప్‌ను నిర్వహిస్తోంది. దీంతో బజార్‌ రూపంలో ఆ లోటును భర్తీ చేయాలని అమెజాన్‌ చూస్తోంది. తద్వారా కొత్త కస్టమర్లను, తన వ్యాపారాన్ని పెంచుకోవాలని భావిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు