రూ.6,000-8,000 స్మార్ట్‌ఫోన్ల వైపు..

ప్రస్తుతం ఫీచర్‌ ఫోన్‌లు వినియోగిస్తున్న వారిలో దాదాపు 75 శాతం వరకు రూ.6,000-8,000 ధర ఉండే స్మార్ట్‌ఫోన్ల వైపు దృష్టి సారిస్తున్నారు.

Published : 06 Apr 2024 01:22 IST

ఫీచర్‌ ఫోన్‌ వినియోగదార్ల చూపు
సైబర్‌ మీడియా రీసెర్చ్‌ నివేదిక

దిల్లీ: ప్రస్తుతం ఫీచర్‌ ఫోన్‌లు వినియోగిస్తున్న వారిలో దాదాపు 75 శాతం వరకు రూ.6,000-8,000 ధర ఉండే స్మార్ట్‌ఫోన్ల వైపు దృష్టి సారిస్తున్నారు. కెమేరా నాణ్యత సరిగా లేకపోవడం, యాప్‌లు లేకపోవడం, ఇంటర్నెట్‌ పరిమితి తక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల వీరంతా స్మార్ట్‌ఫోన్‌ల వైపు మళ్లుతున్నారని సైబర్‌ మీడియా(సీఎమ్‌ఆర్‌) తన నివేదికలో పేర్కొంది. అమృత్‌సర్‌, బెంగళూరు, భోపాల్‌, భువనేశ్వర్‌, కోయంబత్తూరు, దిల్లీ, నాసిక్‌, పట్నా, వారణాసి వంటి నగరాల్లో 2000 మంది మొబైల్‌ వినియోగదార్లను సర్వే చేసిన అనంతరం ఈ నివేదికను వెలువరించింది. దీని ప్రకారం..

  • నాలుగింట మూడొంతుల మంది స్మార్ట్‌ఫోన్‌లకు మారేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ప్రాథమికంగా రూ.6000-8000 శ్రేణి ఫోన్ల వైపే మొగ్గుచూపుతున్నారు.
  • భారతీయ ఫీచర్‌ ఫోన్‌ వినియోగదార్లు సగటున రోజుకు 3 గంటల పాటు కాల్స్‌, అలారమ్స్‌, మెసేజింగ్‌పై గడుపుతున్నారు.
  • మూడింట ఒక వంతు మంది వాతావరణం, వార్తలు, సామాజిక మాధ్యమాలకు సంబంధించిన యాప్‌లను వినియోగిస్తున్నారు.
  • యూపీఐ చెల్లింపుల వంటి ప్రీమియం యాప్‌లను కోరుకునే ఫీచర్‌ ఫోన్‌ వినియోగదార్ల సంఖ్య పెరుగుతోంది. అయితే వారి మొబైళ్లకు ఉండే పరిమతి దృష్ట్యా స్మార్ట్‌ఫోన్ల వైపు.. ముఖ్యంగా అందుబాటు ధర 4జీ, 5జీ ఫోన్ల వైపు చూస్తున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు