Bank Strike: 30, 31 తేదీల్లో బ్యాంకులు పనిచేస్తాయ్‌.. ఉద్యోగుల సమ్మె వాయిదా..

ఉద్యోగుల సమ్మె (Bank Strike)పై బ్యాంకు యూనియన్లు వెనక్కి తగ్గాయి. దీంతో జనవరి 30,31 తేదీల్లో బ్యాంకులు పనిచేయనున్నాయి.

Published : 28 Jan 2023 13:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమ డిమాండ్ల సాధన కోసం బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. జనవరి 30, 31 తేదీల్లో రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె (Bank Strike) నిర్వహించనున్నట్లు బ్యాంక్‌ యూనియన్ల ఐక్య వేదిక యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (UFBU) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తమ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు యూఎఫ్‌బీయూ శనివారం వెల్లడించింది.

ఐదు రోజుల పనిదినాలు, ఎన్‌పీఎస్‌ రద్దు, వేతన పెంపు సవరణపై చర్చలకు ఆహ్వానించడం, ఖాళీగా ఉన్న విభాగాల్లో నియామకాలు తదితర డిమాండ్ల సాధనకు బ్యాంకు యూనియన్లు (Bank Unions) ఈ సమ్మె తలపెట్టాయి. అయితే ఈ డిమాండ్లపై చర్చ నిమిత్తం జనవరి 31న బ్యాంకు యూనియన్లతో సమావేశమయ్యేందుకు ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్ (IBA) అంగీకరించింది. దీంతో సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు ఆల్‌ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్‌ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సీహెచ్‌ వెంకటాచలం తెలిపారు. దీంతో జనవరి 30, 31 తేదీల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని