Vivo: వివో మనీలాండరింగ్‌ కేసు.. లావా ఎండీ సహా నలుగురి అరెస్ట్‌

ED arrests four persons in Vivo PMLA case: వివో మనీలాండరింగ్‌ కేసులో లావా ఎండీ సహా నలుగురిని ఈడీ అరెస్ట్‌ చేసింది. వీరిలో చైనాకు చెందిన వ్యక్తి కూడా ఉన్నారు.

Updated : 10 Oct 2023 16:43 IST

దిల్లీ: చైనా మొబైల్‌ తయారీ కంపెనీ వివోకు (vivo) సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో లావా ఇంటర్నేషనల్‌ మొబైల్‌ కంపెనీ ఎండీ హరి ఓం రాయ్‌ సహా నలుగురిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అరెస్ట్‌ చేసింది. ఇందులో ఒకరు చైనా వ్యక్తి కాగా... ఒకరు చార్టర్డ్‌ అకౌంటెంట్‌, మరో వ్యక్తి ఉన్నారు. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (PMLA) కింద ఈ నలుగురినీ అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టు ముందు హాజరుపరిచి కస్టడీకి కోరే అవకాశం ఉంది. అయితే, వివో కేసులో లావా ఎండీని ఎందుకు అరెస్ట్‌ చేశారన్నది తెలియరాలేదు.

ఎల్‌ఐసీ మార్కెట్‌ వాటాలో క్షీణత.. పెరిగిన ‘ప్రైవేట్‌’ షేర్‌!

వివో సంస్థపై దిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఈడీ దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గతేడాది జులైలో దేశవ్యాప్తంగా ఉన్న వివో, దాని అనుబంధ సంస్థల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. వివో టర్నోవర్‌లో సగానికి పైగా నిధులను (రూ.62,476 కోట్లు) ఆ కంపెనీ చైనాకు తరలించిందని ఈడీ గుర్తించింది. తద్వారా పెద్ద ఎత్తున భారత్‌లో పన్ను ఎగవేతకు పాల్పడిందని అప్పట్లో ఈడీ పేర్కొంది. కంపెనీకి చెందిన బ్యాంకు ఖాతాలనూ స్తంభింపజేసింది. దాదాపు 15 నెలల తర్వాత మళ్లీ ఈ కేసులో అరెస్టులు చోటుచేసుకోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని