Credit Card: క్రెడిట్‌కార్డు బిల్లు భారంగా మారిందా? ఈ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు..!
Credit Card balance tranfer: క్రెడిట్ బకాయిలు భారంగా మారినవారు ఎగవేత ముప్పును తప్పించుకోవడానికి ఓ మార్గం ఉంది. అదే బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో క్రెడిట్ కార్డు (Credit Card)ల వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. అయితే, కార్డుల (Credit Card)పై ఎగవేతలు సైతం అదే స్థాయిలో పెరుగుతుండడం గమనార్హం. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం.. 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన క్రెడిట్ కార్డు (Credit Card) ఎగవేతలు 1.94 శాతం పెరిగి రూ.4,072 కోట్లకు చేరాయి. మరోవైపు బకాయిలు 1.64 లక్షల కోట్ల నుంచి రూ.2.10 లక్షల కోట్లకు పెరిగాయి. ఈ నేపథ్యంలో క్రెడిట్ బకాయిలు భారంగా మారినవారు ఎగవేత (Default) ముప్పును తప్పించుకోవడానికి ఓ మార్గం ఉంది. అదే బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ (Credit Card balance tranfer).
ఏంటీ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్?
ఒక క్రెడిట్ కార్డు బ్యాలెన్స్‌ను మరో కార్డుకు బదిలీ చేస్తే దాన్నే క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ (Credit Card balance tranfer)గా వ్యవహరిస్తారు. ముఖ్యంగా ఇతర బ్యాంకుల క్రెడిట్ కార్డుల (Credit Card)ను ఉపయోగిస్తున్న కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా కార్డు జారీ సంస్థలు ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఒక కార్డుపై ఉన్న బకాయిలపై పడే అధిక వడ్డీ భారాన్ని లేదా ఎగవేత ముప్పును తప్పించుకోవడానికి ఈ సదుపాయం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇతర బ్యాంకులు తక్కువ వడ్డీరేటును కల్పించినప్పుడు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు.
బ్యాంకు ఖాతాలో డబ్బుల్లేవా?అయినా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు
ఎలా పనిచేస్తుంది?
ఒక కార్డు నుంచి మరో కార్డుకు బకాయిలను బదిలీ (Credit Card balance tranfer) చేస్తే.. కొత్త కార్డు జారీ సంస్థ ఆ మొత్తాన్ని పాత కార్డు సంస్థకు చెల్లిస్తుంది. ఆ సొమ్మును కస్టమర్ కొత్త కార్డు సంస్థకు నియమ, నిబంధనలకు లోబడి చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కొంత సమయం ఇస్తారు. దానికి సున్నా వడ్డీరేటు లేదా నామమాత్రపు వడ్డీని మాత్రమే వసూలు చేస్తారు. కొత్త క్రెడిట్ కార్డు లిమిట్‌లో 75- 80 శాతం వరకు బ్యాలెన్స్‌ను బదిలీ చేయడానికి సంస్థలు అనుమతి ఇస్తాయి.
ప్రయోజనాలు..
- క్రెడిట్ కార్డు (Credit Card) బిల్లు చెల్లించలేనప్పుడు కస్టమర్ దాన్ని బదిలీ చేసి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. అలా అన్ని కార్డు బకాయిలను ఒకే దగ్గరకు చేర్చుకోవచ్చు. దీంతో బకాయిలన్నీ ఒకే గొడుగు కిందకు వస్తాయి.
- బకాయిలను ట్రాన్స్‌ఫర్ (Credit Card balance tranfer) చేస్తున్న కార్డు సంస్థలు కచ్చితంగా తక్కువ వడ్డీరేటు ఆఫర్ చేస్తాయి. ఫలితంగా కొంత భారం తగ్గి త్వరగా చెల్లించేందుకు వెసులుబాటు లభిస్తుంది. ఒకసారి చెల్లింపులు సకాలంలో చేయడం ప్రారంభిస్తే క్రెడిట్ స్కోర్ తిరిగి గాడిన పడుతుంది.
- బ్యాలెన్స్ బదిలీ (Credit Card balance tranfer) చేసిన తర్వాత దాన్ని చెల్లించేందుకు కొత్త కార్డు సంస్థలు కొంత సమయాన్ని ఇస్తాయి. అలా డబ్బును సర్దుబాటు చేసుకోవడానికి అదనపు సమయం లభిస్తుంది. ఈ కాలానికి కొన్ని సంస్థలు ఎలాంటి వడ్డీ వసూలు చేయవు. కొన్ని నామమాత్రపు వడ్డీరేటును వర్తింపజేస్తాయి. ఈ సమయంలో కొత్త కొనుగోళ్లు చేసేందుకు అవకాశమూ ఉంటుంది.
- బదిలీ చేసిన బకాయిని తక్కువ వడ్డీరేటుతో నెలవారీ వాయిదాల (EMI) కిందకూ మార్చుకునే వెసులుబాటు ఉంటుంది.
క్రెడిట్ కార్డుల బకాయిల బదిలీ వల్ల కొన్ని ప్రతికూలతలూ ఉన్నాయి...
- బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ (Credit Card balance tranfer)కు అనుమతి కోరుతూ అర్జీ పెట్టుకున్నప్పుడు సంస్థలు ఏమాత్రం జాప్యం చేసినా వడ్డీ పెరిగిపోతుంది. తీరా క్రెడిట్ స్కోర్, భారీ మొత్తంలో బకాయిల పేరిట కొత్త సంస్థ తిరస్కరిస్తే భారం మరింత ఎక్కువవుతుంది. మరోవైపు పలు కారణాలరీత్యా వడ్డీరేటులో రాయితీ ఇవ్వలేమని చెబితే అప్పటి వరకు అదనపు వడ్డీభారం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు.
- అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం కూడా ఉంది. అవకాశం ఉంది కదా అని.. అన్ని బకాయిలను కొత్త కార్డుకు బదిలీ చేస్తే ఆ మొత్తాన్ని చెల్లించలేక ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఒకవేళ సకాలంలో చెల్లించలేకపోతే వడ్డీ భారం అంతకంతకూ పెరుగుతూ పోతుంది.
- బకాయిలు ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడే కస్టమర్లు సాధారణంగా దాన్ని బదిలీ చేయాలని ఆలోచిస్తారు. అంటే కచ్చితంగా ఆ మొత్తం కొత్త కార్డు యుటిలైజేషన్ రేషియో కంటే ఎక్కువే ఉండే అవకాశం ఉంది. ఇది క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
- బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఫీజు, కొత్త కార్డు వార్షిక రుసుములు అదనపు ఖర్చులు. వీటన్నింటినీ లెక్కలోకి తీసుకొని లాభదాయకమనుకుంటేనే ఈ ఆప్షన్‌కు వెళ్లాలి.
కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులతో లాభమేనా?
ఈ సంస్థలు అందిస్తున్నాయి..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంకు, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకులన్నీ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ (Credit Card balance tranfer) ఆప్షన్‌ను ఇస్తున్నాయి. బ్యాంకుని బట్టి షరతులు, నియమనిబంధనలు మారతాయి.
ఎలా చేయాలి?
సంస్థ నియమ నిబంధనల ప్రకారం.. అర్హతగల కస్టమర్లకు మాత్రమే బ్యాంకులు ఈ వెసులుబాటు (Credit Card balance tranfer)ను కల్పిస్తాయి. బ్యాంకుల్లో దీనికి నిర్దిష్టమైన ఫారాలు ఉంటాయి. వాటిని పూర్తి చేసి క్రెడిట్ వివరాలు, పాన్‌కార్డు, ఆధార్ కార్డు, క్రెడిట్ బిల్లు స్టేట్‌మెంట్ల వంటి ప్రాథమిక పత్రాలు జత చేసి ట్రాన్స్‌ఫర్ (Credit Card balance tranfer)కు దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని బ్యాంకులు ఎలాంటి పత్రాలు అవసరం లేకుండానే ఆన్‌లైన్‌లో అర్జీ పెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. మరికొన్ని ఎస్‌ఎంఎస్ ద్వారా, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మాధ్యమం ద్వారా కూడా ఈ వెసులుబాటును కల్పిస్తున్నాయి. క్రెడిట్ స్కోరు, బకాయి మొత్తం వంటి అంశాలన్నింటినీ పరిశీలించి బదిలీకి అనుమతి ఇస్తాయి. కొత్త కార్డు జారీ సంస్థలు పాత కార్డు సంస్థకు డీడీ, నెఫ్ట్ లేదా ఇతర మార్గాల్లో బకాయి మొత్తాన్ని చెల్లిస్తాయి. దీంతో ప్రక్రియ పూర్తవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
PM Modi: అభివృద్ధిపై వాళ్లకు విజన్, రోడ్‌మ్యాప్ లేవు.. విపక్షాలపై మోదీ ఫైర్
-
Rajinikanth: రజనీకాంత్ 170వ చిత్రం.. ఆ ముగ్గురు హీరోయిన్లు ఫిక్స్.. ఎవరెవరంటే?
-
Vande Bharat Train: ట్రాక్‌పై రాళ్లు.. వందే భారత్ లోకో పైలట్ అప్రమత్తతతో ప్రయాణికులకు తప్పిన ప్రమాదం
-
Pawan Kalyan: మున్ముందు దేశమంతా జనసేన భావజాలమే: పవన్ కల్యాణ్
-
Mohamed Muizzu: ముయిజ్జుతో జాగ్రత్త..
-
New Words: ఫిన్స్టా.. గర్ల్‌బాస్.. షెఫ్స్ కిస్.. ‘జెనరేషన్ జడ్’ సరికొత్త పదాలు డిక్షనరీలోకి!