Gautam Adani: టాప్‌-3లో జెఫ్ బెజోస్.. నాలుగో స్థానానికి అదానీ

బ్లూమ్‌బెర్గ్‌ విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితాలో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ నాలుగో స్థానానికి పరిమితమయ్యారు.

Published : 24 Jan 2023 20:15 IST

దిల్లీ: బ్లూమ్‌బెర్గ్‌ విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితాలో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా పేరుపొందిన అదానీ (Gautam Adani) గడిచిన 24 గంటల్లో 872 మిలియన్‌ డాలర్ల సంపదను కోల్పోవడంతో ఒక మెట్టు దిగాల్సి వచ్చింది. ఆయనను వెనక్కి నెట్టి, అమెజాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ జెఫ్‌ బెజోస్‌ టాప్‌-3లో నిలిచారు. మూడో స్థానం కోసం అదానీ, జెఫ్ బెజోస్ (Jeff Bezos) మధ్య గట్టి పోటీనే జరిగింది. బెర్నార్డ్ ఆర్నాల్ట్, ఎలాన్‌ మస్క్‌ తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అధికేత ముకేశ్‌ అంబానీ టాప్-10లో చోటు దక్కించుకోలేక పోయారు.

బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం.. ప్రపంచ కుబేరుల జాబితా..

  • బెర్నార్డ్ ఆర్నాల్ట్ - 188 బి.డాలర్లు
  • ఎలాన్‌ మస్క్‌- 145 బి.డాలర్లు
  • జెఫ్ బెజోస్- 121 బి.డాలర్లు
  • గౌతమ్‌ అదానీ- 120 బి.డాలర్లు
  • బిల్ గేట్స్- 111 బి.డాలర్లు
  • వారెన్ బఫెట్- 108 బి.డాలర్లు
  • లారీ ఎల్లిసన్- 99.5 బి.డాలర్లు
  • లారీ పేజ్- 92.3 బి.డాలర్లు
  • సెర్గీ బ్రిన్‌ - 88.7 బి.డాలర్లు
  • స్టీవ్‌ బామర్‌- 86.9 బి.డాలర్లు
  • ముకేశ్‌ అంబానీ- 84.7 బి.డాలర్లు
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని