బీ20 ఇండియా ఛైర్‌గా ఎన్‌. చంద్రశేఖరన్‌

టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ను బి20 ఇండియా ఛైర్‌గా ప్రభుత్వం నియమించిందని పరిశ్రమల సంఘం సీఐఐ పేర్కొంది.

Published : 08 Dec 2022 05:05 IST

దిల్లీ: టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ను బి20 ఇండియా ఛైర్‌గా ప్రభుత్వం నియమించిందని పరిశ్రమల సంఘం సీఐఐ పేర్కొంది. వచ్చే ఏడాది సెప్టెంబరులో జరిగే జి-20 సమావేశాలకు మన దేశం అధ్యక్షత వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో వ్యాపారాల అజెండాకు చంద్రశేఖరన్‌ బాధ్యత వహిస్తారు. బీ20 ఇండియా సెక్రటేరియట్‌గా సీఐఐను కేంద్రం ఇప్పటికే నియమించింది. ఇది బి20 ఇండియా ప్రక్రియను ముందుండి నడిపిస్తుంది. జి-20కి భారత్‌ అధ్యక్షత వహిస్తుందని డిసెంబరు 1, 2022న ప్రకటన వెలువడిన సమయంలోనే సీఐఐ బీ20 ఇండియా సెక్రటేరియట్‌ బాధ్యతలు చేపట్టింది. 2010లో ఏర్పాటైన బీ20లో జి-20కి చెందిన కంపెనీలు, వ్యాపార సంస్థలు భాగస్వాములుగా ఉంటాయి. ‘అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేసుకోవడం సరికొత్త వ్యాపార వ్యూహమని మేం విశ్వసిస్తున్నాం. తద్వారా ఆర్థిక స్థిరత్వం, ప్రగతి, వృద్ధి వేగవంతమవుతాయ’ని ఈ సందర్భంగా చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని