ఇంటి రుణ వడ్డీ పెంచిన ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌

గృహరుణ సంస్థ ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తన ప్రైమ్‌ లెండింగ్‌ రేటును 0.35 శాతం పెంచుతున్నట్లు వెల్లడించింది. దీంతో వడ్డీ రేటు 8.65 శాతం నుంచి ప్రారంభం కానుంది.

Published : 27 Dec 2022 01:37 IST

ఈనాడు, హైదరాబాద్‌: గృహరుణ సంస్థ ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తన ప్రైమ్‌ లెండింగ్‌ రేటును 0.35 శాతం పెంచుతున్నట్లు వెల్లడించింది. దీంతో వడ్డీ రేటు 8.65 శాతం నుంచి ప్రారంభం కానుంది. కొత్త వడ్డీ రేటు ఈనెల 26 (సోమవారం) నుంచి అమల్లోకి వచ్చిందని సంస్థ తెలిపింది. ఇటీవల ఆర్‌బీఐ రెపో రేటు పెంచడంతో పాటు, మార్కెట్‌ పరిస్థితుల ఆధారంగా రుణరేటును పెంచాల్సి వచ్చిందని ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వై.విశ్వనాథ గౌడ్‌ తెలిపారు. ప్రస్తుతం ఇళ్లు కొనుగోలు చేసేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని