ఎల్‌ అండ్‌ టీ లాభం రూ.2,552.92 కోట్లు

లార్సన్‌ అండ్‌ టుబ్రో (ఎల్‌అండ్‌టీ) డిసెంబరు త్రైమాసికంలో రూ.2,552.92 కోట్ల ఏకీకృత లాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదే కాల లాభం రూ.2,054.74 కోట్లతో పోలిస్తే ఇది 24 శాతం అధికం.

Published : 31 Jan 2023 02:35 IST

దిల్లీ:  లార్సన్‌ అండ్‌ టుబ్రో (ఎల్‌అండ్‌టీ) డిసెంబరు త్రైమాసికంలో రూ.2,552.92 కోట్ల ఏకీకృత లాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదే కాల లాభం రూ.2,054.74 కోట్లతో పోలిస్తే ఇది 24 శాతం అధికం. కార్యకలాపాల ఏకీకృత ఆదాయం రూ.39,562.92 కోట్ల నుంచి 17 శాతం పెరిగి రూ.46,389.72 కోట్లకు చేరింది. మౌలిక రంగ ప్రాజెక్టుల విభాగంలో మెరుగైన పని తీరు, సమాచార, సాంకేతిక, టెక్నాలజీ సేవల (ఐటీ అండ్‌ టీఎస్‌) పోర్ట్‌ఫోలియోలో బలమైన వృద్ధి సాధించడంతోనే ఆదాయం పెరిగిందని కంపెనీ వెల్లడించింది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ రూ.60,710 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకుంది. 2021-22 ఇదే సమయంతో పోలిస్తే ఇవి 21% అధికం. ఫలితాలు ప్రకటించిన అనంతరం నిర్వహించిన కాన్ఫరెన్స్‌ కాల్‌లో కంపెనీ పూర్తి కాల డైరెక్టర్‌, సీఎఫ్‌ఓ ఆర్‌.శంకర్‌ రామన్‌ మాట్లాడుతూ.. ఆర్డర్‌ బుక్‌ జీవన కాల గరిష్ఠానికి చేరడంతో ఆదాయం కూడా భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంద’ని వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని