పోర్షే రూ.1.69 కోట్ల కారు

పోర్షే సరికొత్త పనమేరాను, అత్యంత ఆకర్షణీయ ఫీచర్లతో ఆవిష్కరించింది. దీని ధర(ఎక్స్‌ షోరూం) రూ.1,69,62,000.

Updated : 08 May 2024 12:00 IST

హైదరాబాద్‌: పోర్షే సరికొత్త పనమేరాను, అత్యంత ఆకర్షణీయ ఫీచర్లతో ఆవిష్కరించింది. దీని ధర(ఎక్స్‌ షోరూం) రూ.1,69,62,000. సరికొత్త సస్పెన్షన్‌ వ్యవస్థ, 2.9 లీటర్‌ వి6 టర్బో ఇంజిన్‌ గల ఈ స్పోర్టీ లుక్‌ కారు 5.1 సెకన్లలోనే గంటకు 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. గరిష్ఠ వేగం గంటకు 272 కి.మీ. 10.9 అంగుళాల ఎంటర్‌టైన్‌మెంట్‌ స్క్రీన్‌ ఉంటుంది. చోదకుడి ఏకాగ్రతకు ఇబ్బంది లేకుండా డ్రైవర్‌ సీటు నుంచి చూసినా కనిపించకుండా స్క్రీన్‌ ఏర్పాటు చేశారు. హై రెజొల్యూషన్‌ హెచ్‌డీ మాట్రిక్స్‌ ఎల్‌ఈడీ లైటింగ్‌ సిస్టమ్‌, పార్క్‌ అసిస్ట్‌, ఆటోమాటిక్‌ ఎయిర్‌ రీసర్క్యులేషన్‌ తదితర ఎన్నో ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని