వైద్య పరికరాల దిగుమతులు తగ్గాలి

వైద్య పరికరాల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలంటే ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఫార్మాస్యూటికల్స్‌ (ఔషధ) విభాగ కార్యదర్శి అరుణీష్‌ చావ్లా వెల్లడించారు.

Published : 08 May 2024 03:38 IST

ఔషధ కార్యదర్శి అరుణీష్‌ చావ్లా

దిల్లీ: వైద్య పరికరాల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలంటే ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఫార్మాస్యూటికల్స్‌ (ఔషధ) విభాగ కార్యదర్శి అరుణీష్‌ చావ్లా వెల్లడించారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న 2,000 రకాలకు పైగా వైద్య పరికరాలను ప్రపంచ వ్యాప్తంగా పోటీ పడేలా చేయడానికి ప్రభుత్వం ప్రమాణాలను రూపొందించే పనిలో ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం మన మెడ్‌-టెక్‌ (వైద్య సాంకేతిక) రంగం 75-80% దిగుమతులపై ఆధారపడి ఉందని, వచ్చే అయిదేళ్లలో దిగుమతులపై ఆధారపడటాన్ని 50% కంటే దిగువకు తీసుకురావాలనుకుంటున్నామని చావ్లా తెలిపారు. ఈ రంగానికి మెరుగైన విధానాలను రూపొందించడానికి పరిశ్రమ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)తో కలిసి ఔషధ విభాగం ‘మెడిటెక్‌ స్టాకథాన్‌ 2024’ను నిర్వహించింది. సీఐఐ నేషనల్‌ మెడికల్‌ టెక్నాలజీ ఫోరమ్‌ ఛైర్మన్‌ హిమాన్షు బెయిడ్‌ తదితరులు పాల్గొన్నారు.

భారత మెడ్‌ టెక్‌ పరిశ్రమ 2030 నాటికి 50 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.4,15,000 కోట్ల) స్థాయికి చేరుకుంటుందని అంచనా. ప్రస్తుతం 14 బి.డాలర్ల (రూ.1,16,000 కోట్ల) స్థాయిలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు