అయిదేళ్ల కనిష్ఠానికి పొదుపు

దేశంలో కుటుంబాల నికర పొదుపు గణనీయంగా తగ్గుతోంది. 2020-21తో పోలిస్తే, 2022-23 ఆర్థిక సంవత్సరం చివరకు కుటుంబాల నికర పొదుపు రూ.9 లక్షల కోట్లు తగ్గి రూ.14.16 లక్షల కోట్లకు పరిమితమైంది.

Published : 08 May 2024 03:43 IST

2020-21 నుంచి 2022-23 వరకు రూ.9 లక్షల కోట్లు తగ్గింది
ఫండ్‌లలో మదుపు మూడురెట్లు; షేర్లు, డిబెంచర్లలో రెట్టింపు

దిల్లీ: దేశంలో కుటుంబాల నికర పొదుపు గణనీయంగా తగ్గుతోంది. 2020-21తో పోలిస్తే, 2022-23 ఆర్థిక సంవత్సరం చివరకు కుటుంబాల నికర పొదుపు రూ.9 లక్షల కోట్లు తగ్గి రూ.14.16 లక్షల కోట్లకు పరిమితమైంది. ఇది అయిదేళ్ల కనిష్ఠ స్థాయి. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. 2020-21లో కుటుంబాల నికర పొదుపు రూ.23.29 లక్షల కోట్ల వద్ద గరిష్ఠ స్థాయికి తాకింది. ఆ తర్వాత నుంచి తగ్గుతూ వచ్చింది. 2021-22లో ఇది రూ.17.12 లక్షల కోట్లకు దిగి రాగా.. 2022-23లో రూ.14.16 లక్షల కోట్లకు తగ్గింది. 2017-18లో నమోదైన రూ.13.05 లక్షల కోట్ల తర్వాత ఇదే కనిష్ఠ స్థాయి. ఆ తర్వాత 2018-19లో రూ.14.92 లక్షల కోట్లకు, 2019-20లో రూ.15.49 లక్షల కోట్లకు కుటుంబాల పొదుపు పెరుగుతూ వచ్చింది.

  • 2020-21 నుంచి 2022-23 మధ్య మ్యూచువల్‌ ఫండ్లలో కుటుంబాల మదుపు మూడు రెట్లు పెరిగింది. 2020-21లో ఫండ్‌లలో పెట్టుబడులు రూ.64,084 కోట్లుగా ఉండగా.. 2022-23లో రూ.1.79 లక్షల కోట్లకు చేరాయి. 2021-22లో ఇది రూ.1.6 లక్షల కోట్లుగా నమోదైంది.
  • షేర్లు, డిబెంచర్లలో పెట్టుబడులు కూడా దాదాపు రెట్టింపయ్యాయి. 2020-21లో రూ.1.07 లక్షల కోట్ల నుంచి 2022-23లో రూ.2.06 లక్షల కోట్లకు చేరాయి. 2021-22లో రూ.2.14 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
  • కుటుంబాల బ్యాంకు రుణాలు 2022-23 వరకు మూడేళ్ల కాలంలో రెట్టింపై రూ.11.88 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2020-21లో ఇవి రూ.6.05 లక్షల కోట్లుగాను; రూ.2021-22లో రూ.7.69 లక్షల కోట్లుగాను ఇవి ఉన్నాయి.
  • కార్పొరేషన్లు, బ్యాంకింగేతర సంస్థల నుంచి కుటుంబాల రుణాలు 2020-21లో రూ.93,723 కోట్లుగా ఉండగా.. 2022-23లో నాలుగు రెట్లు పెరిగి రూ.3.33 లక్షల కోట్లకు చేరాయి. 2021-22లో రూ.1.92 లక్షల కోట్లుగా ఇవి నమోదయ్యాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు