హ్యాపియెస్ట్‌ మైండ్స్‌ డివిడెండ్‌ 163%

ఐటీ సంస్థ హ్యాపియెస్ట్‌ మైండ్స్‌ టెక్నాలజీస్‌ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.71.98 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది.

Published : 08 May 2024 03:37 IST

దిల్లీ: ఐటీ సంస్థ హ్యాపియెస్ట్‌ మైండ్స్‌ టెక్నాలజీస్‌ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.71.98 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.57.66 కోట్లతో పోలిస్తే ఇది 24.83% అధికం. కార్యకలాపాల ఆదాయం రూ.377.98 కోట్ల నుంచి 10.4% పెరిగి రూ.417.29 కోట్లకు చేరింది. ఇందులో ఎడ్యుటెక్‌ విభాగ ఆదాయ వాటా 22.3%, ఆరోగ్య సంరక్షణ వాటా 16.1 శాతంగా నమోదయ్యాయి.

2031 ఆర్థిక సంవత్సరం నాటికి 1 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.8,300 కోట్ల) దీర్ఘకాలిక లక్ష్యంతో జెన్‌ ఏఐ (కృత్రిమమేధ) వ్యాపార యూనిట్‌ను కొత్తగా సృష్టించామని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ అశోక్‌ సూతా వెల్లడించారు. రెండు సంస్థల కొనుగోలు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు.

  •  2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం రూ.248.39 కోట్లకు చేరింది. 2022-23 లాభం రూ.230.99 కోట్లతో పోలిస్తే ఇది 7.53% అధికం. ఇదే సమయంలో ఆదాయం రూ.1,429.29 కోట్ల నుంచి 13.66% పెరిగి రూ.1,624.66 కోట్లకు చేరింది. స్థిర కరెన్సీ రూపేణా గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి 11%, ఎబిటా వృద్ధి 24.6 శాతంగా నమోదయ్యాయి. ప్యూర్‌సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌, మ్యాక్‌మిల్లన్‌ లెర్నింగ్‌ సంస్థలను కొనుగోలు చేసినందున, మా వృద్ధికి దోహదం చేయనున్నాయని సంస్థ ఎండీ, సీఎఫ్‌ఓ వెంకట్రామన్‌ నారాయణన్‌ వెల్లడించారు.
  •  2024-25లో 35-40% వృద్ధిని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. 2024 మార్చి 31 నాటికి కంపెనీలో 5,168 మంది పని చేస్తున్నారు. వలసల రేటు 13 శాతంగా ఉంది. రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.3.25 (163%) చొప్పున తుది డివిడెండ్‌ను కంపెనీ బోర్డు ప్రతిపాదించింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు