ట్రేడింగ్‌ సమయం పొడిగింపు లేనట్లే

ఈక్విటీ డెరివేటివ్స్‌ విభాగంలో ట్రేడింగ్‌ సమయాన్ని పొడిగించేందుకు నేషనల్‌ స్టాక్‌   ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) సమర్పించిన ప్రతిపాదనను కేపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తిరస్కరించింది.

Published : 08 May 2024 03:39 IST

ఎన్‌ఎస్‌ఈ ప్రతిపాదనను తిరస్కరించిన సెబీ

దిల్లీ: ఈక్విటీ డెరివేటివ్స్‌ విభాగంలో ట్రేడింగ్‌ సమయాన్ని పొడిగించేందుకు నేషనల్‌ స్టాక్‌   ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) సమర్పించిన ప్రతిపాదనను కేపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తిరస్కరించింది. స్టాక్‌ బ్రోకర్ల నుంచి సానుకూల అభిప్రాయాలు అందకపోవడమే ఇందుకు కారణంగా సెబీ పేర్కొంది. ‘సెబీ మా దరఖాస్తును తిరస్కరించడంతో ప్రస్తుతం ట్రేడింగ్‌ సమయాన్ని పొడిగించే యోచన చేయడం లేద’ని ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈఓ ఆశిష్‌ కుమార్‌ చౌహాన్‌ తెలిపారు.ఈక్విటీ డెరివేటివ్స్‌లో ట్రేడింగ్‌ సమయం పొడిగింపును దశలవారీగా అమలు చేసేందుకు, సెబీకి ఎన్‌ఎస్‌ఈ దరఖాస్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు సెబీ అనుమతుల కోసం చూస్తున్నట్లు  చౌహాన్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు