నష్టాల నుంచి లాభాల్లోకి
ఆఖరి గంటన్నర ట్రేడింగ్‌లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇంట్రాడే కనిష్ఠాల నుంచి కోలుకున్న సూచీలు, లాభాల్లో ముగిశాయి. మే డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు కారణంగా ట్రేడింగ్ ఒడుదొడుకుల మధ్య సాగింది.
సమీక్ష
ఆఖరి గంటన్నర ట్రేడింగ్‌లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇంట్రాడే కనిష్ఠాల నుంచి కోలుకున్న సూచీలు, లాభాల్లో ముగిశాయి. మే డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు కారణంగా ట్రేడింగ్ ఒడుదొడుకుల మధ్య సాగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 4 పైసలు తగ్గి 82.72 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 1.14% నష్టపోయి 77.47 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో టోక్యో లాభపడగా, సియోల్, షాంఘై, హాంకాంగ్ నష్టపోయాయి. ఐరోపా సూచీలు మిశ్రమంగా ట్రేడయ్యాయి.
సెన్సెక్స్ ఉదయం 61,706.13 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. రోజులో ఎక్కువ భాగం నష్టాల్లోనే కదలాడిన సూచీ, ఒకదశలో 61,484.66 వద్ద కనిష్ఠానికి చేరింది. ఆఖర్లో మదుపర్ల కొనుగోళ్లతో లాభాల్లోకి వచ్చిన సెన్సెక్స్, 61,934.01 దగ్గర ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదుచేసింది. చివరకు 98.94 పాయింట్ల లాభంతో 61,872.62 వద్ద ముగిసింది. నిఫ్టీ 35.75 పాయింట్లు పెరిగి 18,321.15 దగ్గర స్థిరపడింది.
* ఆకర్షణీయ త్రైమాసిక ఫలితాలతో ఎల్‌ఐసీ షేరు 1.39% లాభపడి రూ.603.60 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేరు రూ.615.65 వద్ద గరిష్ఠాన్ని తాకింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.6,356.63 కోట్లు పెరిగి రూ.3.81 లక్షల కోట్లకు చేరింది.
* సెన్సెక్స్ 30 షేర్లలో 15 మెరిశాయి. భారతీ ఎయిర్‌టెల్ 2.75%, ఐటీసీ 1.76%, కోటక్ బ్యాంక్ 1.04%, ఎల్ అండ్ టీ 0.99%, పవర్‌గ్రిడ్ 0.85%, బజాజ్ ఫైనాన్స్ 0.78% చొప్పున రాణించాయి. విప్రో, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ, సన్‌ఫార్మా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ 1.35% వరకు నష్టపోయాయి. బీఎస్‌ఈలో 1802 షేర్లు లాభపడగా, 1687 స్క్రిప్‌లు నష్టపోయాయి. 122 షేర్లలో ఎటువంటి మార్పులేదు.
* మాంద్యంలోకి జర్మనీ: ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో జర్మనీ ఆర్థిక వ్యవస్థ 0.3 శాతం క్షీణించింది. 2022 చివరి త్రైమాసికంలోనూ జర్మనీ వృద్ధి 0.5 శాతం క్షీణించింది.
ఫలితంగా ఐరోపాలోని ఈ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక మాంద్యంలోకి జారుకున్నట్లయింది. వరుసగా రెండు త్రైమాసికాల పాటు ప్రతికూల వృద్ధి నమోదైతే, సాంకేతికంగా మాంద్యంలోకి జారుకున్నట్లే. మొదటి త్రైమాసికంలో ఉద్యోగాలు పెరగ్గా, ద్రవ్యోల్బణం కూడా శాంతించింది. అయితే అధిక వడ్డీ రేట్ల వల్ల వినియోగం, పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడినట్లు నిపుణులు వెల్లడించారు.
* రిలయన్స్ చేతికి లోటస్ చాకొలెట్ : లోటస్ చాకొలెట్‌లో నియంత్రిత 51% వాటా కొనుగోలు చేయడాన్ని పూర్తి చేసినట్లు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ వెల్లడించింది. అనుబంధ సంస్థ రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్ మే 24 నుంచి లోటస్ చాకొలెట్‌పై నియంత్రణ చేపట్టినట్లు వెల్లడించింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే లోటస్ చాకోలెట్ కొనుగోలుకు రిలయన్స్ రూ.74 కోట్లు వెచ్చించింది. గతేడాది డిసెంబరులో లోటస్ చాకొలెట్‌లో నియంత్రణ వాటాను కొనుగోలు చేస్తున్నట్లు రిలయన్స్ రిటైల్ ప్రకటించింది. షేరు కొనుగోలు ఒప్పందం ప్రకారం.. లోటస్‌లో 77% పెయిడప్ షేరు క్యాపిటల్‌ను ప్రమోటర్లు ప్రకాశ్ పీరాజే పాయ్, అనంత్ పీరాజే పాయ్‌ల నుంచి కొనుగోలు చేస్తామని రిలయన్స్ కన్జూమర్ తెలిపింది. మరో 26 శాతం అదనపు వాటా కొనుగోలుకు ఓపెన్ ఆఫర్ ప్రకటించింది.
* భారత్‌లో సెమీకండక్టర్ వ్యాపారానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఆఫీస్, తయారీ కార్యకలాపాలు)గా మైక్ యంగ్‌ను నియమించినట్లు వేదాంతా-ఫాక్స్‌కాన్ సెమీకండక్టర్స్ లిమిటెడ్ వెల్లడించింది. ఫాక్స్‌కాన్, వేదాంతా గ్రూప్ సంయుక్తంగా ఈ సంస్థను ఏర్పాటు చేశాయి.
* కల్వర్ మ్యాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో విలీన ప్రతిపాదనను పునఃసమీక్షించాల్సిందిగా ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈకి ఎన్‌సీఎల్‌టీ ఇచ్చిన ఆదేశాలపై జీ ఎంటర్‌టైన్‌మెంట్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఎన్‌సీఎల్‌ఏటీ శుక్రవారానికి వాయిదా వేసింది.
* గ్రాన్యూల్స్ ఇండియాలో సమాచార చౌర్యం: తమ సంస్థలో ‘సమాచార చౌర్యం ఘటన’ జరిగినట్లు ఔషధ సంస్థ గ్రాన్యూల్స్ ఇండియా వెల్లడించింది. ఈ ప్రభావం పడిన ఐటీ వ్యవస్థలను స్తంభింపజేసినట్లు తెలిపింది. ఈ ఘటనపై అత్యంత ప్రాధాన్యతతో విచారణ చేపడుతున్నట్లు ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. ఈ ఏడాది మార్చిలో సన్‌ఫార్మా సైతం ఇదే తరహా ఘటనను ప్రకటించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
Delhi Liquor Policy Case: ఈడీ అధికారులు బెదిరించడం వల్లే కవిత పేరు చెప్పారు
-
General News
Odisha Train Accident : అక్కడి వాతావరణం భీతావహం.. ‘ఈనాడు’తో ఏపీ ప్రయాణికులు
-
India News
అరిహాను స్వదేశానికి పంపండి.. మూడేళ్ల పాప కోసం జర్మనీపై భారత్ ఒత్తిడి
-
India News
Train Accidents: దశాబ్దకాలంలో జరిగిన పెను రైలు ప్రమాదాలివీ..
-
Ap-top-news News
AP IIIT Admissions 2023: ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు వేళాయె
-
Ap-top-news News
Odisha Train Accident: ఏపీ ప్రయాణికులు ఎందరో?