జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఇన్‌ఫ్రాకు పెరిగిన నష్టాలు

జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌కు నష్టాలు పెరిగాయి. ఏకీకృత ఖాతాల ప్రకారం మార్చి త్రైమాసికంలో రూ.1,895 కోట్ల స్థూల ఆదాయంపై రూ.637 కోట్ల నికర నష్టాన్ని సంస్థ నమోదు చేసింది.

Published : 30 May 2023 02:18 IST

ఈనాడు, హైదరాబాద్‌: జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌కు నష్టాలు పెరిగాయి. ఏకీకృత ఖాతాల ప్రకారం మార్చి త్రైమాసికంలో రూ.1,895 కోట్ల స్థూల ఆదాయంపై రూ.637 కోట్ల నికర నష్టాన్ని సంస్థ నమోదు చేసింది. 2021-22 ఇదే కాలంలో ఆదాయం రూ.1,284 కోట్లు, నికర నష్టం రూ.129 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే ఆదాయంతో పాటు నష్టాలు కూడా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం పూర్తికాలానికి సంస్థ రూ.6,693 కోట్ల స్థూల ఆదాయంపై రూ.840 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. 2021-22లో రూ.4,601 కోట్ల ఆదాయంపై రూ.752 కోట్ల  నికర నష్టాన్నే ప్రకటించింది. జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ మనదేశంలో దిల్లీ, హైదరాబాద్‌, గోవా (మోప) విమానాశ్రయాలు, ఇండొనేషియాలోని మెడాన్‌ విమానాశ్రయాన్ని నిర్వహిస్తోంది. గ్రీస్‌లోని క్రేట్‌లో కొత్త విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని