Maruti Suzuki: ఫైనాన్సింగ్‌ కోసం మారుతీ సుజుకీ, ఇండియన్‌ బ్యాంకు ఒప్పందం

మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్‌ తన డీలర్లకు ఫైనాన్సింగ్‌ సొల్యూషన్స్‌ అందించడానికి ఇండియన్‌ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఈ రోజు తెలిపింది.

Published : 14 Sep 2023 18:22 IST

దిల్లీ: ఆటోమొబైల్‌ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్‌ తన డీలర్లకు ఫైనాన్సింగ్‌ సొల్యూషన్స్‌ అందించడానికి ఇండియన్‌ బ్యాంకుతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ మేరకు ఇరువర్గాలు అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేశాయి. ఇది దేశవ్యాప్తంగా 4,000 మారుతీ సుజుకీ డీలర్‌షిప్‌ల వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలు తీరుస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందం ఇండియన్‌ బ్యాంకు, మారుతీ డీలర్ల భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌ సీనియర్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు. ఇండియన్‌ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అశుతోష్‌ చౌదరి మాట్లాడుతూ.. మారుతీ సుజుకీ డీలర్లకు అనుకూలమైన నిబంధనలతో వర్కింగ్‌ క్యాపిటల్‌ అందిస్తుందని, ఇది వారి వ్యాపార వృద్ధికి తోడ్పడుతుందని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు