GST: సత్రాల అద్దెపై జీఎస్‌టీ ఉండదు.. స్పష్టతనిచ్చిన కేంద్రం

సత్రాలు, మతపరమైన, ఛారిటీల నిర్వహణలోని సముదాయాలకు చెందిన గదుల నుంచి వచ్చే అద్దెపై ఎలాంటి జీఎస్‌టీ ఉండదని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది...

Published : 05 Aug 2022 18:02 IST

దిల్లీ: సత్రాలు; మతపరమైన, ఛారిటీల నిర్వహణలోని సముదాయాలకు చెందిన గదుల నుంచి వచ్చే అద్దెపై ఎలాంటి జీఎస్‌టీ (GST) ఉండదని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఇటీవల గదుల అద్దెపై 12 శాతం జీఎస్‌టీ (GST) విధించిన నేపథ్యంలో ఈ విషయంలో నెలకొన్న సందిగ్ధతపై ‘కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు (CBIC)’ స్పస్టతనిచ్చింది. 

అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయానికి సమీపంలో ఉన్న సత్రాల్లోని గదులకు జీఎస్‌టీ (GST) మినహాయింపునివ్వాలని కోరుతూ ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ రాఘవ్‌ చద్దా గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ అందజేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై స్పష్టతనిచ్చింది. రోజుకి రూ.1,000 కంటే తక్కువ అద్దె ఉన్న హోటల్‌ గదులపైనా 12 శాతం పన్ను విధిస్తూ జూన్‌లో జీఎస్‌టీ (GST) మండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ ఆధ్వర్యంలోని సత్రాల్లో జీఎస్‌టీ (GST) వసూలు చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టతనిచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని