EPF: పనిచేయని పీఎఫ్‌ ఖాతాల్లో రూ.4,962 కోట్లు

2022 మార్చి 31 నాటికి ఈపీఎఫ్‌ కింద ఇన్‌యాక్టివ్‌ ఖాతాల్లో పెద్ద మొత్తంలో నిధులు పేరుకుపోయాయని కార్మికశాఖ మంత్రి వెల్లడించారు.

Published : 30 Mar 2023 15:22 IST

దిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి పథకం కింద నమోదైన ఖాతాల్లో ఇన్‌యాక్టివ్ స్థితిలో ఉన్న వాటిలో పెద్ద ఎత్తున నిధులు పేరుకుపోయాయని కేంద్ర కార్మికశాఖ మంత్రి రామేశ్వర్‌ తేలి తెలిపారు. అలా 2022 మార్చి 31 నాటికి దాదాపు రూ.4,927.7 కోట్లు పోగుపడ్డాయని లోక్‌సభలో ఓ ప్రశ్నకు బదులిస్తూ వెల్లడించారు. అయితే, ఇన్‌యాక్టివ్‌  ఖాతాలన్నింటికీ కచ్చితమైన హక్కుదారులున్నారని పేర్కొన్నారు.

ఈపీఎఫ్‌ కింద నమోదైన ఉద్యోగులు తమ వేతనంలో 12 శాతాన్ని పీఎఫ్‌ ఖాతాకు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఒక వేళ ఈ ఖాతాల్లో వరుసగా 36 నెల పాటు ఎలాంటి జమలు లేకపోతే.. వాటిని ఇన్‌యాక్టివ్‌ ఖాతాలుగా పరిగణిస్తారు. పనిచేసే కంపెనీ నుంచి నిష్క్రమించిన తర్వాత మూడేళ్ల వరకు నిధులను ఉపసంహరించుకోకపోయినా.. ఆ ఖాతాలను కూడా ఇన్‌యాక్టివ్‌గా గుర్తిస్తారు. అయితే, ఖాతాల్లో ఉండే నిధులకు మాత్రం వడ్డీ జమవుతూనే ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని